Pushpa 2 The Rule: పుష్పరాజ్ రీఎంట్రీతో ఫిల్మ్ ఇండస్ట్రీ షేక్ అవుతుందా?
Pushpa 2 movie prerelease business: పుష్ప 2 సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ 1000 కోట్ల రూపాయలతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Pushpa 2: కోట్లాది మంది సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. ‘పుష్ప 2 : ది రూల్’ థియేట్రికల్ ట్రైలర్ నిన్న ఆదివారం బీహార్ రాష్ట్రంలోని పట్నాలో విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు లక్షలాది మంది అభిమానులు హాజరై, ఈ ఈవెంట్ ని విజయవంతం చేశారు. ఒక తెలుగు హీరో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఈ రేంజ్ లో జనాలు తరలి రావడం ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. దీనిని బట్టి మొదటి రోజు హిందీ వెర్షన్ వసూళ్లు ఒక రేంజ్ లో ఉంటాయని అభిమానులు భావిస్తున్నారు.
ఈ ట్రైలర్ ప్రారంభం లో జగపతి బాబు మాట్లాడే డైలాగ్స్ పుష్ప క్యారెక్టర్ కి ఎలివేషన్స్ గొప్పగా ఇచ్చినట్లుగా అనిపించింది. అల్లు అర్జున్ గెటప్స్, డైలాగ్స్ ఈ ట్రైలర్ లో ఆయన అభిమానులకు ఉర్రూతలు ఊగించేలా చేసింది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్ అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ ఒక రేంజ్ లో పేలింది. చివర్లో ఫహద్ ఫాజిల్ తో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా అని కేశవ డైలాగ్ చెప్పగా, దానికి ఫహద్ ఫాజిల్ గన్ పేలుస్తూ ఫైర్ కదా అని కామెడీగా అంటాడు. అప్పుడు అల్లు అర్జున్ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని చెప్పే డైలాగ్ జనాలకు తెగ నచ్చేసింది. అవుట్ & అవుట్ కమర్షియల్ సినిమాగా సుకుమార్ ఈ చిత్రాన్ని తీసినట్టు ఈ ట్రైలర్ ని చూస్తే అర్థమైపోతుంది. ముఖ్యంగా జాతర ఎపిసోడ్స్, పోర్ట్ ఫైట్ ఈ సినిమాకే హైలైట్ గా నిలవబోతున్నాయి.
ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ. 1000 కోట్లు
పుష్ప 2 సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ 1000 కోట్ల రూపాయలతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎకనమిక్ టైమ్స్ కథనం ప్రకారం కేవలం థియేట్రికల్ రైట్స్ ద్వారానే ఈ సినిమాకు రూ. 640 కోట్ల ఆదాయం వచ్చిందని తెలుస్తోంది. నాన్-థియేట్రికల్ రైట్స్ మరో రూ.425 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. థియేట్రికల్ రైట్స్ విషయానికొస్తే.. తెలంగాణ, ఏపీ కలిపి రూ. 220 కోట్లు, ఉత్తరాది మార్కెట్ నుండి రూ. 200 కోట్లు, తమిళనాడు నుండి రూ. 50 కోట్లు, కర్ణాటకలో రూ. 30 కోట్లు, కేరళ నుండి రూ. 20 కోట్లు రాబట్టింది. ఇవేకాకుండా ఓవర్సీస్ బిజినెస్ మరో రూ. 140 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ విషయానికొస్తే... ఓటిటి రైట్స్ కొన్న నెట్‌ఫ్లిక్స్ నుండి రూ. 275 కోట్లు, మ్యూజిక్ రైట్స్ ద్వారా రూ. 65 కోట్లు, శాటిలైట్ రైట్స్ ద్వారా మరో రూ. 85 కోట్లు ఉన్నాయి. ఇలా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రెండూ కలిపి ఇప్పటికే ఈ చిత్రం బిజినెస్ రూ. 1000 కోట్లు క్రాస్ చేసింది.
బ్లాక్ బస్టర్ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో పెరిగినట్లు తెలుస్తున్నాయి. ట్రైలర్ రాకముందే మూడు వేలకు పైగా షోస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. అక్కడి ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ చిత్రానికి రూ.7.37 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ట్రైలర్ రిలీజై జనంలో క్రేజ్ బాగా పెంచింది. అమెరికాలోని ప్రీమియర్ షోస్ నుండి ఈ సినిమాకి మూడు మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. టాక్ పాజిటివ్‌గా వస్తే నాలుగు మిలియన్ డాలర్లు రాబట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.
నేషనల్ అనుకుంటివా... ఇంటర్నేషనల్
ఈ ట్రైలర్ క్వాలిటీ ని చూసి డైరెక్టర్ సుకుమార్ ను ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ తన ప్రతీ సినిమాలోనూ నటన పరంగా తనను తాను కొత్తగా ప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నాడు. సినిమా ఎలా ఉన్నా కూడా, తన అద్భుతమైన నటనతో జనాలను సీట్స్ లో కూర్చోబెట్టి సినిమా చూపించడం ఆయనకీ వెన్నతో పెట్టిన విద్య. అందుకే, పుష్ప సినిమాకు ఆయనకు జాతీయ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభించింది. పుష్ప -2 ట్రైలర్ చూస్తుంటే సుకుమార్ అల్లు అర్జున్ లోని ది బెస్ట్ ని లాగేశాడనిపిస్తోందని నెటిజెన్లు రాస్తున్నారు.
పుష్ప పార్ట్ 1 మొత్తం హీరోయిజం మీదనే కథ నడిచింది. కానీ పుష్ప 2 లో ఎమోషన్స్, సెంటిమెంట్, వేరే లెవెల్ లో ఉన్నట్లు తెలుస్తోంది. బాహుబలి 2 , కేజీఎఫ్ చాప్టర్ 2 వంటి సినిమాలు నార్త్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి అసలు కారణం ఎమోషన్స్ పండడమే. పుష్ప 2 లో కూడా అవి పుష్కలంగా పెట్టినట్లు ఆ ట్రైలర్ ని చూస్తేనే అర్థం అవుతుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించే హీరోలలో ఒకడు అల్లు అర్జున్. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక చనిపోతుంది. ఆమె శవాన్ని ఎర్ర చందనం కట్టెలతో కాల్చడం మనం ట్రైలర్ లో గమనించొచ్చు. ఈ సన్నివేశం లో అల్లు అర్జున్ ఎమోషనల్ యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉండబోతుందని ఆశించవచ్చు. అదే విధంగా పోర్ట్ లో అల్లు అర్జున్ విలన్స్ తో చేసే పోరాట సన్నివేశం కూడా అద్భుతంగా వచ్చినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా అల్లు అర్జున్ నట విశ్వరూపాన్ని ప్రతీకగా పుష్ప 2 ట్రైలర్ ఉంది.
జగపతిబాబు, ప్రియమణి వచ్చేశారు..
ఇక పుష్ప 2లో జగపతి బాబు మాత్రమే కాకుండా మరి కొందరు నటులు కూడా యాడ్ అయ్యారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అయితే ఎలాంటి పాత్ర అన్నది థియేటర్లోనే చూడాలి. వీరితో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియమణి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ఆకట్టుకోనున్నారు. అలాగే బిగ్ బాస్ బ్యూటీ దివి కూడా ఈ సినిమాలో నటించింది. ఈమె సినిమాలో ఓ న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అలాగే ట్రైలర్ లో అరగుండు, మెడలో చెప్పులు వేసుకుని కనిపించే ఓ పాత్ర హైలెట్ అని చెప్పుకోవాలి. అది సినిమాలోనే హైలెట్ పాత్ర అని తెలుస్తోంది. ఈ పాత్రని దేవరలో భైర కొడుకుగా నెగిటివ్ రోల్‌లో నటించిన తారక్ పొన్నప్ప చేశారు. కన్నడ సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు పొందిన ఆయన ఈ పాత్రలో జీవించారని చెప్పుకోవాలి.
పుష్ప 2 ట్రైలర్ యూట్యూబ్ లో మాత్రం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇటీవల వచ్చిన రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ టీజర్ రికార్డ్స్ ని 24 గంటలు కూడా గడవకముందే బ్రేక్ చేసి ఆల్ టైం రికార్డు ని నెలకొల్పింది ‘పుష్ప 2’ ట్రైలర్. యూట్యూబ్ లో ఇప్పటి వరకు అప్డేట్ అయిన వ్యూస్ ఎంతంటే తెలుగు లో 41 మిలియన్ వ్యూస్, హిందీ లో 29 మిలియన్ వ్యూస్, తమిళం లో 3.7 మిలియన్ వ్యూస్, మలయాళం 2 మిలియన్ వ్యూస్ బెంగాలీ లో 5 లక్షల వ్యూస్ వచ్చాయి. ఓవరాల్ గా అన్ని భాషలకు కలిపి 70 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఓవరాల్ రియల్ టైం వ్యూస్ 100 మిలియన్ కి పైగానే ఉంటుందని సమాచారం.
డిసెంబర్ 5న ఈ పాన్ ఇండియా మూవీ విడుదల కానుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో పుష్ఫ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ క్రేజీ సీక్వెల్ మూవీ మొదటి రోజే బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రం తొలిరోజు రూ.270 కోట్ల వసూళ్లు రాబట్టుతుందని అంటున్నారు. ప్రముఖ ఫిల్మ్ వెబ్‌సైట్ సాక్నిక్ .. ‘పుష్ప2 : రూల్’ సినిమా తొలిరోజు ఎంత వసూళ్లు రాబట్టగలదో అంచనా వేసింది.
ఈ సినిమా ఇండియాలోరూ. 200 కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని, విదేశాల నుండి 70 కోట్ల రూపాయలు ఈ సినిమాకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అలా చేస్తే పుష్ఫ 2 రోజు మొదటి రోజు వసూళ్లు 270 కోట్ల రూపాయల దాటుతాయంటోంది. భారతదేశంలోని ఏ ప్రాంతం నుండి ఎన్ని కోట్ల రూపాయలు వస్తాయనే సమాచారం సాక్నిక్ అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి రూ.85 కోట్లు, కర్ణాటక నుంచి రూ.20 కోట్లు, తమిళనాడు రాష్ట్రం నుంచి రూ.12 కోట్లు, కేరళ నుంచి రూ.8 కోట్ల రూపాయలు వస్తాయట. ఇక ఇండియాలోని మిగతా ప్రాంతాల నుంచి రూ.75 కోట్ల వసూళ్లు వస్తాయని అంచనా వేసింది. టోటల్ గా ఇండియాలో ఈ మూవీ రూ.200 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని నివేదించింది.
పార్ట్ 1 వసూళ్ళు రెండు రోజుల్లోనే...
‘పుష్ప’ ఫస్ట్ పార్టు మొత్తం రూ.300 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ‘పుష్ప 2’ చిత్రం మాత్రం రెండు రోజుల్లోనే ఈ వసూళ్లను చేరుకోనుందని సాక్నిక్ నివేదించింది. విదేశాల్లోనూ ‘పుష్ప 2’ సినిమాపై హైప్ క్రియేట్ కావడంతో తొలిరోజే హిట్ అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని అందుకొని పుష్ప 2 సినిమా 1500 కోట్ల కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది.
ఒకవేళ ఈ సినిమాతో బన్నీ గనుక 1000 కోట్ల కలెక్షన్స్ ను కనక సంపాదించినట్లు అయితే ఆయన పేరు ఇండస్ట్రీలో మరోసారి మారు మ్రోగడం ఖాయమనే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమా తర్వాత సీక్వెట్ ఉంటుందని తెలుస్తోంది. పుష్ప3కి కావాల్సిన పర్ఫెక్ట్ హుక్‌ని పుష్ప సీక్వెల్ ఎండింగ్‌లో సుకుమార్ ప్లాన్ చేశారన్నది ఫిల్మ్ నగర్ టాక్.
ఈ ఏడాది వెయ్యి కోట్ల మార్క్ దాటే సత్తా ఉన్న సినిమాగా ఆల్రెడీ పుష్ప సీక్వెల్ ప్రచారంలో ఉంది. డిసెంబర్ 5న వెండి తెర మీద గంధపు చెక్కల యాక్షన్ ఘాటును ఆస్వాదించడానికి మేం రెడీ అని ఫ్యాన్స్ గట్టిగానే సిగ్నల్స్ ఇస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో పుష్ప2 కోసం వెయిటింగ్ మామూలుగా లేదు. పుష్ప2 ఇప్పుడు నేషనల్ లెవల్లో టాప్‌లో ట్రెండింగ్ లో ఉండడమే అందుకు తిరుగులేని రుజువు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire