Pushpa 3 : అల్లు అర్జున్‌కు షాకిచ్చిన లెక్కల మాస్టర్.. ఆ స్టార్ హీరోతో చేతులు కలిపిన సుకుమార్

Pushpa 3 : అల్లు అర్జున్‌కు షాకిచ్చిన లెక్కల మాస్టర్.. ఆ స్టార్ హీరోతో చేతులు కలిపిన సుకుమార్
x

Pushpa 3 : అల్లు అర్జున్‌కు షాకిచ్చిన లెక్కల మాస్టర్.. ఆ స్టార్ హీరోతో చేతులు కలిపిన సుకుమార్

Highlights

దేశవ్యాప్తంగా సినీ అభిమానులను ఉర్రూతలూగించిన పుష్ప 2 సినిమా గతేడాది చివర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.

Pushpa 3 : దేశవ్యాప్తంగా సినీ అభిమానులను ఉర్రూతలూగించిన పుష్ప 2 సినిమా గతేడాది చివర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో మూడవ స్థానంలో నిలిచింది. దర్శకుడు సుకుమార్ పుష్ప 2 ఎండింగులో పుష్ప 3 కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. అంతేకాదు ఒక ఇంటర్వ్యూలో పుష్ప 3 వన్-లైనర్ సిద్ధంగా ఉందని కూడా చెప్పారు. అయితే, తాజాగా సుకుమార్ హఠాత్తుగా పుష్ప 3 ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ బదులు, సుకుమార్ ఇప్పుడు మరో స్టార్ హీరోతో చేతులు కలిపారు!

పుష్ప తర్వాత పుష్ప 2 ప్రారంభించిన సుకుమార్, ఆ సినిమా పూర్తయిన వెంటనే పుష్ప 3 మొదలుపెడతారని అందరూ ఆశించారు. కానీ, సుకుమార్ ఇప్పుడు తన దృష్టిని మరొక ప్రాజెక్ట్‌పై కేంద్రీకరించారు. ఆయన ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కొత్త సినిమా కోసం ఆయన ఇప్పటికే స్క్రిప్ట్ తయారీలో నిమగ్నమై ఉన్నారు. ఈ సినిమా గురించి స్వయంగా నిర్మాతలు అధికారికంగా కన్ఫాం చేయడం విశేషం.

ప్రస్తుతం రామ్ చరణ్, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ సంస్థే డబ్బులు పెడుతోంది. పెద్ది సినిమా మార్చి, 2026లో విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తవగానే, రామ్ చరణ్, సుకుమార్ కలిసి చేయబోయే కొత్త సినిమాను ప్రారంభించనున్నారు. సుకుమార్-రామ్ చరణ్ సినిమాకు కూడా మైత్రి మూవీ మేకర్స్‌ వారే భారీ బడ్జెట్‌తో పెట్టుబడి పెడుతున్నట్లు ఆ సంస్థ నిర్మాతలు ఖచ్చితమైన హామీ ఇచ్చారు.

దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటూ, రామ్ చరణ్ సినిమా కోసం చిత్రకథను సిద్ధం చేస్తున్నారు. పెద్ది షూటింగ్ పూర్తి కాగానే సుకుమార్ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు తెలియజేశారు. ఇదొక భారీ బడ్జెట్ సినిమా కావడం విశేషం. అంతేకాకుండా ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

వాస్తవానికి సుకుమార్, రామ్ చరణ్ కలిసి పనిచేయడం ఇది రెండోసారి. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో రామ్ చరణ్ చెవిటివాడి పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. బాక్సాఫీస్ వద్ద కూడా ఆ సినిమా అప్పట్లో రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మరోసారి రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో, రంగస్థలం మ్యాజిక్‌ను వీరు రిపీట్ చేస్తారా లేదా అని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories