ఆఫర్ లను తిరస్కరిస్తున్న "పుష్ప: ది రూల్" నిర్మాతలు

ఆఫర్ లను తిరస్కరిస్తున్న "పుష్ప: ది రూల్" నిర్మాతలు
*ఆఫర్ లను తిరస్కరిస్తున్న "పుష్ప: ది రూల్" నిర్మాతలు
Pushpa Producers: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప: ది రైజ్" బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక బాలీవుడ్ లో కూడా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను అందుకొని ట్రేడ్ వర్గాలకు సైతం షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి రెండవ భాగమైన "పుష్ప: ది రూల్" పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ సినిమా కూడా బాలీవుడ్ లో మంచి వసూళ్లు నమోదు చేసుకునే అవకాశం ఎక్కువగానే ఉంది.
అయితే చిత్ర నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారికి బాలీవుడ్ నుంచి పలు ఆఫర్లు వస్తున్నాయట. కానీ మైత్రి వారు మాత్రం ఈ సినిమా రైట్స్ ను అమ్మడానికి ఆసక్తి చూపించడం లేదు."పుష్ప: ది రైజ్" సమయంలో బాలీవుడ్ లో తమ సినిమాకి అంత బజ్ లేదు అనుకొని మైత్రి వారు వేరే వారికి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇచ్చారు కానీ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో కూడా బన్నీకి ఉన్న క్రేజ్ ని బాగా అర్థం చేసుకున్న మైత్రి వారు "పుష్ప: ది రూల్" విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి అనుకుంటున్నారు. అందుకే తమ సినిమాని తామే ఓన్ గా బాలీవుడ్ లో డిస్ట్రిబ్యూట్ చేసుకోడానికి సిద్ధమవుతున్నారు మైత్రి మూవీ మేకర్స్. ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతోంది ఈ ప్రముఖ నిర్మాణ సంస్థ.
ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMTతిరుమలలో తెలుగమ్మాయి, అమెరికా అబ్బాయి పెళ్లి
6 Aug 2022 6:05 AM GMTKomatireddy Venkat Reddy: రేవంత్ పెద్ద తప్పు చేశారు.. ఇకపై ఆయన ముఖం కూడా చూడను..
5 Aug 2022 7:27 AM GMT
స్వప్న దత్ లేకపోయుంటే 'సీతారామం' సినిమా మరోలా ఉండేదేమో
8 Aug 2022 11:11 AM GMTTirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 25...
8 Aug 2022 10:43 AM GMTMudragada Padmanabham: కోనసీమ పెద్దలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ
8 Aug 2022 10:25 AM GMTTaapsee Pannu: నా శృంగార జీవితం అంత ఆసక్తికరంగా లేదు..
8 Aug 2022 9:55 AM GMTTelangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMT