Viral Video: దేవుడివి సామీ నువ్వు..లారెన్స్ చేసిన ప‌నికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

Viral Video: దేవుడివి సామీ నువ్వు..లారెన్స్ చేసిన ప‌నికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
x

Viral Video: దేవుడివి సామీ నువ్వు..లారెన్స్ చేసిన ప‌నికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

Highlights

Raghava Lawrence: తాజాగా తమిళనాడులోని ఓ నిరుపేద కుటుంబానికి ఆర్థికంగా సాయం చేసి వారి జీవితంలో వెలుగు నింపారు.

Raghava Lawrence: సినిమాల్లో కేవలం నటుడిగానే కాకుండా, నిజజీవితంలో మంచితనానికి చిహ్నంగా నిలుస్తున్నారు రాఘవ లారెన్స్. పేదలకు తోడుగా నిలిచే విషయంలో ఎప్పుడూ ముందుండే లారెన్స్‌ మరోసారి తన మంచి హృదయాన్ని చాటుకున్నారు. తాజాగా తమిళనాడులోని ఓ నిరుపేద కుటుంబానికి ఆర్థికంగా సాయం చేసి వారి జీవితంలో వెలుగు నింపారు.

తమిళనాడు శివగంగై జిల్లాలోని తిరుప్పువనానికి చెందిన కుమార్, ముత్తుకరుప్పి అనే దంపతులు రోజువారీ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ముగ్గురు పిల్లలతో కలిసి గడుపుతున్న ఈ కుటుంబం పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడి పొదుపు చేస్తూ వచ్చారు. హుండీ రూపంలో డబ్బును భద్రంగా ఉంచాలని భావించి ఇంట్లోనే ఓ చిన్న గుంత తవ్వి దానిలో దాచారు.

కొద్ది రోజుల తర్వాత హుండీని తీసి డబ్బును లెక్కించగా, దాదాపు లక్ష రూపాయలుండగా తెలిసింది. అయితే ఇటీవల మళ్లీ హుండీని తీసి చూడగా, చెద పురుగులు దానిలోకి ప్రవేశించి కొన్ని రూ.500 నోట్లను నాశనం చేసినట్లు గుర్తించారు. కష్టపడి కూడబెట్టిన డబ్బు నష్టపోవడంతో కుటుంబం తీవ్ర ఆవేదనకు లోనైంది.

ఈ ఘటనపై మీడియాలో వార్తలు వెలువడిన వెంటనే, రాఘవ లారెన్స్ స్పందించి ఆ కుటుంబానికి నష్టం నష్టంగా లక్ష రూపాయల సహాయం చేశారు. లారెన్స్ చేసిన ఈ పనికి అభిమానులు ఫిదా అవుతున్నారు. నిజ‌మైన హీరో లారెన్స్ అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఇక ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్ వేదిక‌గా పోస్ట్ చేసిన లారెన్స్‌.. "ఓ కూలీ కుటుంబం కష్టపడి పొదుపు చేసిన డబ్బు చెదలు తినేశాయన్న వార్త నాకు తెలిసింది. ఇది నా మనసును బాధించింది. వారు కోల్పోయిన మొత్తాన్ని వారికి తిరిగి అందించగలగడం నాకు సంతృప్తినిచ్చింది. ఈ కథనాన్ని నా దృష్టికి తీసుకువచ్చిన మీడియా, ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అని రాసుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories