రాజ్ తరుణ్ 'టార్టాయిస్' చిత్రం ప్రారంభం! థ్రిల్లర్ కథతో రానున్న యంగ్ హీరో!

రాజ్ తరుణ్ టార్టాయిస్ చిత్రం ప్రారంభం! థ్రిల్లర్ కథతో రానున్న యంగ్ హీరో!
x
Highlights

యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు అమృత చౌదరి జంటగా, ప్రముఖ నటులు శ్రీనివాస్ అవసరాల మరియు ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'టార్టాయిస్'....

యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు అమృత చౌదరి జంటగా, ప్రముఖ నటులు శ్రీనివాస్ అవసరాల మరియు ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'టార్టాయిస్'. రిత్విక్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఈరోజు (నవంబర్ 17) హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిత్ర బృందం మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.

ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్ మరియు ఎన్ వి ఎల్ క్రియేషన్స్ బ్యానర్లపై శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి మరియు రామిశెట్టి రాంబాబు గార్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

విడుదలైన మోషన్ పోస్టర్‌కు ముందున్న వాయిస్ ఓవర్ ఉత్కంఠను రేకెత్తించింది."పగలు రాత్రి కలవకూడదు అన్నది దైవ నిర్ణయం అయితే, కత్తి తో చావును కలపాలన్నది మానవ నిర్ణయం. రాత్రి జరిగే హత్యలకి సాక్ష్యం ఈ చంద్రుడు. వాడు ఎప్పటికి సాక్షిగా రాడు. కష్టాల్లో వున్న వాళ్ళని కాపాడే వాడే కథానాయకుడు. కానీ ఆ కాపాడే వాడే చంపడం మొదలు పెడితే..."

ఈ చిత్రానికి ఆస్కార్ విజేత చంద్రబోస్ గారు సాహిత్యాన్ని అందించగా, అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు.

యూనిట్ మాటల్లో...

హీరో రాజ్ తరుణ్: 'టార్టాయిస్' కథ చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంది. దర్శకుడు రిత్విక్ కుమార్ కథ చెప్పిన విధానం అద్భుతం. ఈ చిత్రంలో నటించడం నా కెరీర్‌కు మంచి కిక్ ఇస్తుందని నమ్ముతున్నాను. ఇంత మంచి కథతో ముందుకు వచ్చిన నిర్మాతలకు అభినందనలు.

దర్శకుడు రిత్విక్ కుమార్: 'టార్టాయిస్' ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో కూడిన థ్రిల్లర్ చిత్రం. ఇది రాజ్ తరుణ్ గారి కెరీర్‌లో బెస్ట్ సినిమా అవుతుంది. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ, అమృత చౌదరి పాత్రలు చాలా బలంగా ఉంటాయి. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు.

నిర్మాతలు: మాకు కథ బాగా నచ్చింది. దర్శకుడు రిత్విక్ కుమార్ పై మాకు పూర్తి నమ్మకం ఉంది. రాజ్ తరుణ్ గారితో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. త్వరలో షూటింగ్ మొదలవుతుంది. థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories