SS Rajamouli: "అది నా స్వార్థం" అంటున్న జక్కన్న

"అది నా స్వార్థం" అంటున్న జక్కన్న
SS Rajamouli: "అది నా స్వార్థం" అంటున్న జక్కన్న
SS Rajamouli: తెలుగు సినిమా గురించి ప్రపంచానికి చాటి చెప్పిన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. ఇప్పటిదాకా ఒక్క ఫ్లాప్ సినిమా కూడా ఎరుగని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ రాజమౌళి పేరు ఇప్పుడు ఒక టాలీవుడ్ లో ఒక బ్రాండ్ గా మారిపోయింది. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ఎందరో సినీ అభిమానులు రాజమౌళి సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తాజాగా "ఆర్ఆర్ఆర్" సినిమాతో తన "బాహుబలి" రికార్డులను తానే బద్దలు కొట్టుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు హీరోగా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు.
అయితే తాజాగా ఒక ఇంగ్లీష్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "బాహుబలి తర్వాత నా నెక్స్ట్ సినిమా పై చాలా ప్రేజర్ ఉంది కానీ 'ఆర్ ఆర్ ఆర్' ఆ బౌండరీలను కూడా దాటినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు భారతీయ కథలు ప్రపంచ స్థాయిలో ప్రదర్శింపబడాలని నేను కోరుకుంటున్నాను. కానీ అందులో నేను ముందుండాలి అనుకుంటున్నాను.
అది నా స్వార్థం" అన్న రాజమౌళి భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నప్పుడు రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుందని సినిమా హిట్ అయితే నిర్మాతలకి మంచి కలెక్షన్లు వస్తాయి కానీ ఫ్లాప్ అయితే నష్టాలు కూడా అంతే భారీగా ఉంటాయని అన్నారు. ఇక మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి రెండు లైన్లను అనుకుంటున్నారట. సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMTతిరుమలలో తెలుగమ్మాయి, అమెరికా అబ్బాయి పెళ్లి
6 Aug 2022 6:05 AM GMTKomatireddy Venkat Reddy: రేవంత్ పెద్ద తప్పు చేశారు.. ఇకపై ఆయన ముఖం కూడా చూడను..
5 Aug 2022 7:27 AM GMT
Telangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMTBreaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTఎన్టీఆర్ తో నటించే అవకాశం కోల్పోయిన సమంత
8 Aug 2022 9:20 AM GMTసినీ ఇండస్ట్రీపై దిల్ రాజు కీలక కామెంట్స్
8 Aug 2022 7:32 AM GMTరాజగోపాల్‌రెడ్డి రాజీనామాకు స్పీకర్ ఆమోదం.. ఆరు నెలల్లోపు..
8 Aug 2022 7:26 AM GMT