Baahubali The Eternal War: మళ్లీ తెరపై బాహుబలి సంచలనం

Baahubali The Eternal War: మళ్లీ తెరపై బాహుబలి సంచలనం
x

Baahubali The Eternal War: మళ్లీ తెరపై బాహుబలి సంచలనం

Highlights

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్ ఇండియన్ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది.

Baahubali The Eternal War: ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్ ఇండియన్ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. ఇప్పుడు ఈ ఎపిక్‌ను కామిక్ సిరీస్‌గా మలచనున్నారు. టీజర్ రిలీజ్‌తో ఆసక్తి మరింత పెరిగింది. దేవ-అసుర యుద్ధం నేపథ్యంలో కొత్త కథనం సిద్ధమవుతోంది.

టాలీవుడ్‌ను ప్రపంచ మాప్‌పై నిలిపిన మాగ్నమ్ ఓపస్ బాహుబలి. ఎస్.ఎస్.రాజమౌళి విజన్‌తో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. రెండు భాగాలను ఒకే చిత్రంగా రీ-కట్ చేసి బాహుబలి ది ఎపిక్‌గా రిలీజ్ చేశారు. ఇప్పుడు మరో కొత్త ప్రయత్నంతో బాహుబలి కామిక్ సిరీస్‌గా బాహుబలి ది ఎటర్నల్ వార్ రూపొందుతోంది.

ఇషాన్ శుక్లా దర్శకత్వంలో రాజమౌళి ప్రెజెంట్ చేస్తున్న బాహుబలి ది ఎటర్నెల్ వార్ పార్ట్ 1 టీజర్ రిలీజైంది. టీజర్‌లో బాహుబలి, దేవేంద్రుడి మధ్య యుద్ధం కాన్సెప్ట్ ఆకట్టుకుంది. దేవ-అసుర సంగ్రామంలో బాహుబలి పాత్ర ఏమిటో తెలుసుకోవాలంటే చిత్రం కోసం వేచి చూడాలి. 2027లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. బాహుబలి క్రేజ్ మరోసారి నిరూపితమైంది. ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన ఈ సిరీస్ కామిక్ రూపంలో కొత్త చరిత్ర సృష్టించనుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories