Raju Gari Gadhi 4: 'రాజు గారి గది 4' స్క్రిప్ట్‌ రెడీ: ఓంకార్‌

Raju Gari Gadhi 4: బుల్లితెరపై డిఫరెంట్ హోస్టింగ్‌తో తక్కువ కాలంలోనే ఫేమస్ అయ్యాడు ఓంకార్.

Venkata Chari
Updated on: 13 Jun 2021 9:46 PM IST
Raju Gari Gadhi 4 Script is Ready says Omkar
X

ఓంకార్ (ఫొటో ట్విట్టర్)

Raju Gari Gadhi 4: బుల్లితెరపై డిఫరెంట్ హోస్టింగ్‌తో తక్కువ కాలంలోనే ఫేమస్ అయ్యాడు ఓంకార్. ఈ ఫేమ్ తో వెండితెరపై సత్తా చాటేందుకు 'జీనియస్‌' సినిమాతో దర్శకుడిగా మారాడు. కానీ, ఈ సినిమా బోల్తాకొట్టడంతో.. మరలా చిన్నతెరపై రియాలిటీ షోలపై దృష్టి పెట్టాడు.

మరోసారి వెండితెరపై హారర్‌ స్క్రిప్ట్‌తో సిద్ధమై తన లక్ ను పరీక్షించుకున్నాడు. రాజుగారి గది సినిమాతో భారీ హిట్ కొట్టి.. తన సత్తా చాటాడు. ఈ సినిమాకు వరుసగా సీక్వెల్స్‌ ప్లాన్ చేసి సక్సెస్ అయ్యాడు. రెండో సీక్వెల్ గా వచ్చిన 'రాజు గారి గది 3' సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టు కోలేదు.

ప్రస్తుతం 'రాజు గారి గది 4' కథను రెడీ చేసే పనిలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తలను నిజం చేస్తూ.. ఓ ఇంటర్వ్యూలో ఓంకార్ 'రాజు గారి గది 4' స్క్రిప్ట్‌ రెడీ అయిందని క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాతోపాటు ఓ థ్రిల్లర్‌, స్పోర్ట్స్‌, గ్రామీణ నేపథ్యంలో కథలు రాస్తున్నానని తెలిపాడు. కానీ కరోనాతో ఇవేవీ పట్టాలెక్కలేదని అన్నాడు.

Venkata Chari

Venkata Chari

Next Story