Ram Charan-Upasana: సింబాస్ ఇన్‌కమింగ్.. మెగా ట్విన్స్‌కు డేట్ ఫిక్స్?

Ram Charan-Upasana: సింబాస్ ఇన్‌కమింగ్.. మెగా ట్విన్స్‌కు డేట్ ఫిక్స్?
x
Highlights

Ram Charan-Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Ram Charan-Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ స్టార్ కపుల్ త్వరలోనే ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్నారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. 2026 జనవరి 31న ఉపాసన డెలివరీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త నిజమైతే మెగా కుటుంబంలో ఆనందం రెట్టింపు అవడం ఖాయమనే చెప్పాలి. గతేదాడి దీపావళికి ఉపాసన శీమంతంను మెగా ఫ్యామిలీ గ్రాండ్‌గా చేసిన విషయం తెలిసిందే.

2012లో రామ్ చరణ్, ఉపాసనల వివాహం జరిగింది. ఈ దంపతులకు 2023 జూన్ 20న క్లీంకార కొణిదెల జన్మియించింది. ఇప్పటికే తమ కుటుంబ జీవితం, వ్యక్తిగత క్షణాలను చాలా ప్రైవేట్‌గా ఉంచే చరణ్, ఉపాసన జంట.. త్వరలో మరోసారి తలిదండ్రులు కాబోతున్నారు. ఈ స్టార్ కపుల్ ఈసారి ట్విన్స్‌కు తల్లిదండ్రులు కాబోతున్నారని సమాచారం. ప్రస్తుతం ఉపాసన ఆరోగ్యం బాగుందని, డెలివరీకి అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చేస్తున్నారని టాక్. ఈ ప్రత్యేక సమయంలో చరణ్ తన షూటింగ్ కమిట్‌మెంట్స్‌ను తగ్గించి.. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నాడరట. ఈ విషయంపై ఇప్పటివరకు చరణ్, ఉపాసన,మెగా ఫామిలీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ట్విన్స్‌ పుట్టబోతున్నారనే ప్రచారం మాత్రం మెగా అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేపుతోంది. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

'మెగా వారసుడు', 'జూనియర్ మెగా పవర్ స్టార్' అంటూ అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో సంబరాలు మొదలుపెట్టేశారు. ‘సింబా ఇన్‌కమింగ్’ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్స్ క్రియేట్ చేస్తున్నారు. ‘ది ప్రిన్స్ ఈజ్ అరైవింగ్’ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు మెగా క్యాంప్‌లో హీట్ పెంచుతున్నాయి. మెగా సామ్రాజ్యానికి మరో వారసుడు అడుగుపెట్టబోతున్నాడన్న వార్త అభిమానులను ఉప్పొంగేలా చేస్తోంది. జనవరి 31 మెగా ఫ్యాన్స్‌కు గుర్తుండిపోయే రోజుగా మారబోతోందనే టాక్ నెట్టింట నడుస్తోంది. మెగా కుటుంబానికి సంబంధించిన ఏ చిన్న వార్తైనా అభిమానుల్లో ఎంతటి ఉత్సాహం రేపుతుందో ఈ ప్రచారం మరోసారి రుజువు చేస్తోంది.

'మన శంకర వరప్రసాద్ గారు'తో మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ సక్సెస్‌ను బాస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో మెగా ట్విన్స్‌కు డేట్ ఫిక్స్ అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మెగా ఫ్యాన్స్‌కు ఇది నిజంగా డబుల్ ట్రీట్ అని చెప్పొచ్చు. ఇక రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమాని మార్చి 27న విడుదల చేయాలని భావించినప్పటికీ.. షూటింగ్‌ ఇంకా పూర్తికాకపోవడంతో రిలీజ్ లేట్ అవ్వనుంది. పెద్ది సినిమాను సమ్మర్‌ లేదంటే దసరా సీజన్‌కు పోస్ట్‌పోన్‌ చేసే అవకాశముందని టాక్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories