
Ram Charan Pedd
Ram Charan Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ప్రమోషన్ల కోసం ఐపీఎల్ 2026 వేదికను సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఐపీఎల్ వాడేస్తారట
Ram Charan Peddi: రామ్ చరణ్ RRR మూవీతో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఆ తరువాత రెండు సినిమాలు ఆయనవి విడుదలయ్యాయి. తానే నిర్మాతగా చేసిన ఆచార్య, శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్ రెండు సినిమాలు ఆశించినంత ఫలితాలను ఇవ్వలేదు. ఒకరకంగా గేమ్ ఛేంజర్ మూవీ రామ్ చరణ్ కు విపరీతమైన నిరాశను కలిగించిందని చెప్పవచ్చు. రామ్ చరణ్ ఫాన్స్ కూడా ఆ సినిమా విషయంలో చాలా నిరాశ చెందారు.
ఇప్పుడు రామ్ చరణ్ తాజా మూవీ పెద్ది సెట్స్ పై ఉంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాపై అటు రామ్ చరణ్ ఇటు ఆయన అభిమానులే కాకుండా.. ఇండస్ట్రీలో కూడా చాలా అంచనాలు ఉన్నాయి. సినిమా నుంచి వచ్చిన రెండు సింగిల్స్ కూడా సోషల్ మీడియాను ఒక ఊపు ఊపాయి. రికార్డ్ వ్యూయర్ షిప్స్ తో సంచలనం సృష్టించాయి. దీంతో పెద్ది మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. రామ్ చరణ్ లుక్స్.. జాన్వీ కపూర్ గ్లామర్ సాంగ్స్ లో చూసిన ప్రేక్షకులు పెద్ది సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. యావత్ సినీ అభిమానులు పెద్ది మూవీ కోసం అంతలా ఎదురుచూస్తుంటే, రామ్ చరణ్ మాత్రం ఐపీఎల్ 2026 కోసం వెయిట్ చేస్తున్నారట. అదేంటి ఎంత క్రికెట్ ఇష్టం అయితే, తన సినిమా రిలీజ్ కంటే ఐపీఎల్ ముఖ్యమా అనిపిస్తోంది కదూ. ఆయన ఎదురు చూస్తున్నది కూడా పెద్ది మూవీ గురించే. కన్ఫ్యూజ్ గా ఉంది కదూ. పెద్దికి, ఐపీఎల్ కి లింకేంటి అనిపిస్తోంది కదూ.
Ram Charan Peddi: నిజానికి ఈ మూవీ క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ క్రికెట్ బ్యాట్ పట్టుకుని బాల్ ని కొట్టిన షాట్ వైరల్ అయిన విషయమూ గుర్తుంది కదా. ఈ మూవీలో హీరో రామ్ చరణ్ ఒక గ్రామానికి చెందిన క్రికెట్ ఆటగాడి పాత్రను పోషిస్తున్నాడు. అందుకే భారతదేశంలో క్రికెట్ పండుగ అయిన ఐపీఎల్ సందర్భంగా ఈ సినిమాను ప్రమోట్ చేయాలని మూవీ యూనిట్ డిసైడ్ అయింది. ఈ ఐపీఎల్‌ను లక్ష్యంగా చేసుకుని ఫుల్ ప్రమోషన్స్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకు ప్లానింగ్ కూడా జరిగిందట.
Ram Charan Peddi: ఐపీఎల్ మెయిన్ ఈవెంట్ లో 'పెద్ది' సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడానికి పెద్ద ప్లాన్ చేశారని టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. అంతేకాదు, ఐపీఎల్ మ్యాచ్ లకు వెళ్లి అక్కడ మూవీని ప్రమోట్ చేయడానికి రామ్ చరణ్ రెడీ అయిపోయారట. అందుకే ఎప్పుడు ఐపీఎల్ 2026 స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు రామ్ చరణ్ అని తెలుస్తోంది. 'పెద్ది' టీమ్ హైదరాబాద్ ఐపీఎల్ టీమ్‌తో ప్రమోషన్ ఒప్పందం కుదుర్చుకుంటుందని కూడా వార్తలు షికార్లు చేస్తున్నాయి. అదే నిజమైతే పెద్ది మూవీ ప్రమోషన్స్ లో కొత్త సంప్రదాయానికి తెరతీసినట్టు అవుతుంది.
క్రికెట్‌ను ఎక్కువగా ఇష్టపడే గ్రామీణ యువకుడిగా రామ్ చరణ్ కనిపించబోతున్న పెద్ది మూవీలో జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్. కన్నడ నటుడు శివన్న కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో 'ఉప్పెన' సినిమాను దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




