Ram Charan : కొత్త సినిమా ఒప్పుకున్న రామ్ చరణ్.. అభిమానులకు మొదలైన టెన్షన్

Ram Charan : కొత్త సినిమా ఒప్పుకున్న రామ్ చరణ్.. అభిమానులకు మొదలైన టెన్షన్
x

Ram Charan : కొత్త సినిమా ఒప్పుకున్న రామ్ చరణ్.. అభిమానులకు మొదలైన టెన్షన్

Highlights

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమాలో నటిస్తున్నారు. రామ్ చరణ్ చివరిగా శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేశారు.

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమాలో నటిస్తున్నారు. రామ్ చరణ్ చివరిగా శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ పెద్ద బడ్జెట్ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. దీంతో జాగ్రత్తగా వ్యవహరించి బుచ్చిబాబుతో ఒక సినిమా చేస్తున్నారు. ఈ మధ్య ఆయన కొత్త సినిమా గురించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

పెద్ది చిత్రంపై చరణ్ అభిమానులకు భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయిక. ఈ చిత్రాన్ని గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరిస్తున్నారు. అంతేకాకుండా, ఈ చిత్రంలో చరణ్ విభిన్న లుక్‌లో కనిపించనున్నారు.

పెద్ది చిత్రం తర్వాత చరణ్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రంగస్థలం చిత్రం ఇప్పటికే విడుదలైంది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్య ఒక దర్శకుడు చరణ్‌తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసింది. వీరిద్దరి కాంబో దాదాపు ఖాయమైందని పరిశ్రమలో వినిపిస్తోంది. అయితే, ఆ దర్శకుడితో సినిమా గురించి చరణ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆ దర్శకుడు మెహర్ రమేష్.

టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకుడు మెహర్ రమేష్ వరుస అపజయాలతో సతమతమవుతున్నారు. బిల్లా చిత్రం మినహా ఆయన దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలు పరాజయం పాలయ్యాయి. చివరి చిత్రం భోళా శంకర్ కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ దర్శకుడు స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. కానీ, అన్ని చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఇప్పుడు మెహర్ రమేష్ చరణ్‌తో సినిమా చేస్తున్నారనే వార్త వినిపిస్తోంది. ఇది అభిమానులకు చాలా ఆందోళన కలిగిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories