Ram Charan: ‘పెద్ది’ పాట ‘చికిరి’ సెన్సేషన్.. 5 లక్షలు దాటిన షార్ట్స్..

Ram Charan: ‘పెద్ది’ పాట ‘చికిరి’ సెన్సేషన్.. 5 లక్షలు దాటిన షార్ట్స్..
x
Highlights

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా పాటలు మళ్లీ మ్యూజిక్ ఛార్టులను షేక్ చేస్తున్నాయి.

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా పాటలు మళ్లీ మ్యూజిక్ ఛార్టులను షేక్ చేస్తున్నాయి. కొత్తగా ‘పెద్ది’ నుంచి వచ్చిన చికిరి పాట రికార్డులు బద్దలు కొడుతుంటే పదిహేనేళ్ల ‘ఆరెంజ్’ పాటలు కూడా ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్నాయి.

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట ‘చికిరి’ సెన్సేషనల్ హిట్ అవుతోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాట తెలుగు వెర్షన్ యూట్యూబ్‌లో కేవలం కొద్ది రోజుల్లోనే 5 లక్షల 20 వేలకు పైగా షార్ట్స్ సాధించింది. ఈ పాట మ్యూజిక్ ఛార్టులను డామినేట్ చేస్తోంది.

అదే సమయంలో 2010లో వచ్చిన కల్ట్ క్లాసిక్ ‘ఆరెంజ్’ పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయి. ముఖ్యంగా ‘నేను నువ్వంటూ’ పాట స్పాటిఫై హైదరాబాద్ టాప్ సాంగ్స్‌లో టాప్ 6లో ట్రెండింగ్ అవుతోంది. పదిహేనేళ్ల తర్వాత కూడా ఈ పాటలు యూత్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఒకవైపు కొత్త సినిమా ‘పెద్ది’ పాటలు రికార్డులు బద్దలు కొడుతుంటే మరోవైపు పాత చిత్రం ‘ఆరెంజ్’ పాటలు ఇప్పటికీ టాప్ ఛార్టుల్లో నిలుస్తుండటం చరణ్ స్టార్‌డమ్‌కు నిదర్శనం.

Show Full Article
Print Article
Next Story
More Stories