Ramayana Teaser: రణబీర్, సాయి పల్లవిల ‘రామాయణ’ టీజర్ రిలీజ్

Ramayana Teaser
x

Ramayana Teaser: రణబీర్, సాయి పల్లవిల ‘రామాయణ’ టీజర్ రిలీజ్

Highlights

Ramayana First Look Teaser Out: రణబీర్ కపూర్, సాయి పల్లవి కలిసి నటించిన రామాయణ సినిమాకు చెందిన టీజర్ ఈ రోజు లాంచ్ అయింది. నితేష్ తివారీ తెరకెక్కించిన రామాయణం పార్ట్ 1 షూటింగ్ కంప్లీట్ చేసుకుందని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

Ramayana First Look Teaser Out: రణబీర్ కపూర్, సాయి పల్లవి కలిసి నటించిన రామాయణ సినిమాకు చెందిన టీజర్ ఈ రోజు లాంచ్ అయింది. నితేష్ తివారీ తెరకెక్కించిన రామాయణం పార్ట్ 1 షూటింగ్ కంప్లీట్ చేసుకుందని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే దీనికి సబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఈ సినిమాకు సంబంధించి ఒక ఫోటోని కూడా ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు.

రెండు పార్టులుగా రామాయణ సినిమా రాబోతుంది. ఇందులో మొదటిది రామాయణ పార్ట్ 1 లో రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవిలు తమ నటనతో అందరినీ మైమరిపిస్తారనే అందరూ అనుకుంటున్నారు. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, భయంకరమైన రావణుడిగా యష్, సీతగా సాయిపల్లవి నటించారు. ఎంతో కాలంగా.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్ ఎట్టకేలకు జూలై 3న ఆవిష్కరించారు.

ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై ఎన్నో రామాయణ కథలు సినమాలుగా వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఇదే దారిలో రామాయణ వచ్చింది. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు . ఇక ఈ కథ గురించి చెప్పాలంటే కీలకమైన రావణాసురిడి పాత్రలో కన్నడ స్టార్ యష్ నటిస్తున్నాడు.

ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్‌‌ని కూడా రిలీజ్ చేయకుండా.. ఎటువంటి హంగు ఆర్బాటాలు లేకుండా ఈ చిత్ర నిర్మాణం జరుగుతుంది. ఇన్ని రోజులు ఈ సినిమా ఎలా ఉంటుందా? అని ఎదురుచూసిన ఆడియన్స్‌కు ఒక చిన్నపాటి వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఎవరెవరు ఏయే పాత్రల్లో చేస్తున్నారో తెలుస్తుంది. చివరలో యష్ లుక్ అదేవిధంగా ఎండ్‌లో రాముడిగా రణబీర్ ఎంట్రీ ఫ్రేమ్ అదిరిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే రామాయణ టీజర్ అంచనాలను మించి ఉంది. ఈ సినిమాకి రెహ్మాన్ మ్యూజిక్ అందించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా 2027లో దీపావళి కానుకగా రాబోతుంది. అప్పటివరకు ఆడియన్స్ వేచి చూడాల్సిందే.



Show Full Article
Print Article
Next Story
More Stories