OTT : ఓటీటీలోకి తొలి సంక్రాంతి మూవీ.. రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ స్ట్రీమింగ్ డేట్ ఇదే!

OTT : ఓటీటీలోకి తొలి సంక్రాంతి మూవీ.. రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ స్ట్రీమింగ్ డేట్ ఇదే!
x

OTT : ఓటీటీలోకి తొలి సంక్రాంతి మూవీ.. రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Highlights

OTT : సంక్రాంతికి విడుదలైన రవితేజ సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఫిబ్రవరిలో Zee5లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధం.

OTT : సంక్రాంతి కానుకగా విడుదలైన మాస్ మహారాజా రవితేజ సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 13న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. మిశ్రమ స్పందనతో బిలో యావరేజ్‌గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయింది.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ Zee5 భారీ ధరకు సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 13 నుంచి జీ5 వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు ఓటీటీప్లే రిపోర్ట్ వెల్లడించింది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ఇదే తేదీ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఒకవేళ ముందుగానే స్ట్రీమింగ్ ప్రారంభమైతే, 2026లో ఓటీటీలోకి వచ్చిన తొలి సంక్రాంతి సినిమా ఇదే కానుంది.

కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామాలో రవితేజ వ్యాపారవేత్త పాత్రలో నటించాడు. భార్య (డింపుల్ హయతి), మరో మహిళ (ఆషికా రంగనాథ్) మధ్య ఇరుక్కుపోయే వ్యక్తిగా ఆయన కనిపించాడు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ ఆకట్టుకున్నప్పటికీ, సెకండ్ హాఫ్‌లో కథ బలహీనంగా మారడంతో పాటు క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సంక్రాంతి బరిలో భారీ సినిమాల పోటీ కూడా ఈ సినిమాకు మైనస్‌గా మారింది.

ప్రస్తుతం రవితేజ తన తదుపరి చిత్రం ‘ఇరుముడి’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తండ్రీ–కూతురు బంధం నేపథ్యంలో తెరకెక్కుతోందని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories