Top
logo

Rama Rao on Duty: మాస్ మహారాజ్ 'రామారావు ఆన్ డ్యూటీ' ఫస్ట్ లుక్ రిలీజ్

Ravi Teja With Sharath Mandava Movie Title Ramarao on Duty First Look Poster Released
X

Ravi Teja - (Photo: Twitter)

Highlights

రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో వస్తోన్నమూవీ 'రామారావు ఆన్ డ్యూటీ' అనే టైటిల్ తో ఫస్టు లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

Rama Rao on Duty Movie: క్రాక్ లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత వరుసగా సినిమాలు సినిమాలు చేస్తున్నారు రవితేజ. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' మూవీ చేస్తున్నారు. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే రవితేజ శరత్ మండవ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఆర్టి టీమ్ వర్క్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ''రామారావు ఆన్ డ్యూటీ'' అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

తెలుగు సంవత్సరం 'ఉగాది' పండుగను పురస్కరించుకుని కొత్త సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. కానీ కోవిడ్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయింది. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో రీసెంట్‌గా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. ''రామారావు ఆన్ డ్యూటీ'' ఫస్ట్ లుక్ పోస్టర్ లో మాస్ రాజా రవితేజ హాఫ్ స్లీవ్ షర్ట్ - ఫార్మల్ ప్యాంట్ ధరించి ట్రెండీ గాగుల్స్ పెట్టుకొని సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అంతేకాదు ఈ పోస్టర్ లో రవితేజ ప్లే చేస్తున్న బి.రామారావు పేరుతో ప్రమాణ స్వీకార పత్రం కూడా ఉంది. అలానే ఆయనకు కేటాయించిన ప్రభుత్వ వాహనం మరియు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం అనే బోర్డులను బ్యాగ్రౌండ్ లో చూడవచ్చు.

ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాజర్ - నరేష్ - పవిత్ర లోకేష్ - రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు. 'మజిలీ' సినిమాతో పరిచయమైన హీరోయిన్ దివ్యాన్ష కౌశిక్ నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేసిందట చిత్రబృందం. మొదటి షెడ్యూల్‌లో రవితేజపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట.

Web TitleRavi Teja With Sharath Mandava Movie Title Rama Rao on Duty First Look Poster Released | Rama Rao on Duty Movie
Next Story