Bharta Mahashayulaku Vignapti Trailer: ట్రైలర్ టాక్.. రూట్ మార్చేసిన మాస్ మహారాజా రవితేజ

Bharta Mahashayulaku Vignapti Trailer: ట్రైలర్ టాక్.. రూట్ మార్చేసిన మాస్ మహారాజా రవితేజ
x

Bharta Mahashayulaku Vignapti Trailer: ట్రైలర్ టాక్.. రూట్ మార్చేసిన మాస్ మహారాజా రవితేజ

Highlights

Bharta Mahashayulaku Vignapti Trailer: సంక్రాంతి బరిలో ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ మాస్ మహారాజా రవితేజ వస్తున్నాడు.

సంక్రాంతి బరిలో ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ మాస్ మహారాజా రవితేజ వస్తున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొనగా, తాజాగా విడుదలైన ట్రైలర్ ఆసక్తిని మరింత పెంచింది.

ఆకట్టుకునేలా ట్రైలర్ కట్

2.19 నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ ప్రారంభం నుంచి చివరి వరకు ఎంగేజింగ్‌గా సాగుతుంది. అనవసరమైన సస్పెన్స్‌కు పోకుండా, కథలోని ప్రధాన అంశాన్ని ట్రైలర్‌లోనే క్లియర్‌గా చెప్పేశారు దర్శకుడు. పెళ్లైన ఒక వ్యక్తి మరో మహిళ ప్రేమలో పడటం, ఆ తర్వాత ఇద్దరు మహిళల మధ్య అతడు ఎదుర్కొనే సంఘర్షణల నేపథ్యంలో కథ సాగనున్నట్టు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది.

ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్

ఫ్యామిలీ బాండింగ్, ఎమోషన్లు, వినోదం అన్నింటినీ సమపాళ్లలో కలిపి ఈ సినిమాను పూర్తి పండుగ చిత్రం గా తీర్చిదిద్దినట్టు ట్రైలర్ సూచిస్తోంది. సంక్రాంతి సమయంలో కుటుంబంతో కలిసి చూడదగిన సినిమాగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఉండబోతోందనే నమ్మకాన్ని మేకర్స్ ట్రైలర్ ద్వారా కలిగించారు.

కొత్త కోణంలో రవితేజ

ట్రైలర్ చూస్తే రవితేజ ఈ సినిమాలో పూర్తిగా భిన్నంగా కనిపించనున్నారని అర్థమవుతుంది. ఎమోషన్, ఎనర్జీ రెండింటినీ కొత్త కోణంలో చూపించే పాత్రలో మాస్ మహారాజా కనిపించనున్నారు. అందుకే ఈ సినిమాకు తన పేరుకు ముందు ఉండే ‘మాస్ మహారాజా’ ట్యాగ్ వాడొద్దని రవితేజ చెప్పారనే విషయం ఇప్పుడు అర్థమవుతోంది.

గ్లామర్, కామెడీ స్పెషల్ ప్లస్

డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ గ్లామర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని ట్రైలర్ సూచిస్తోంది. సత్య, వెన్నెల కిషోర్, సునీల్, మురళీధర్ గౌడ్‌ల కామెడీ ట్రాక్ కూడా బాగా వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. భీమ్స్ అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అవుతోంది.

ట్రైలర్‌తో పెరిగిన బజ్

ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన రాగా, ఇప్పుడు ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్ స్థాయిలోనే సినిమా కూడా ఉంటే, ఈ సంక్రాంతికి రవితేజ ఖాతాలో మరో సూపర్ హిట్ ఖాయం అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories