Akhanda 2: ‘అఖండ 2’ నిర్మాణ సంస్థకు ఊరట

Akhanda 2: ‘అఖండ 2’ నిర్మాణ సంస్థకు ఊరట
x
Highlights

Akhanda 2: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అఖండ 2: తాండవం' నిర్మాణ సంస్థ 14 రీల్స్‌ ప్లస్‌ (14 Reels Plus) కు తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది.

Akhanda 2: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అఖండ 2: తాండవం' నిర్మాణ సంస్థ 14 రీల్స్‌ ప్లస్‌ (14 Reels Plus) కు తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ చిత్రానికి సంబంధించి సింగిల్ బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది.

తెలంగాణలో 'అఖండ 2' సినిమా టికెట్ ధరల పెంపు మరియు ముందస్తు ప్రీమియర్‌లపై గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్, సినిమా ప్రీమియర్లను రద్దు చేయాలని, అలాగే టికెట్ ధరలను పెంచకూడదని ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ ఆదేశాలపై చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్‌ ప్లస్‌ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.

నిర్మాణ సంస్థ అప్పీల్‌పై విచారణ జరిపిన డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై ఈ నెల 14వ తేదీ వరకూ స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కేసు తదుపరి విచారణను డిసెంబర్ 15వ తేదీకి వాయిదా వేసింది. దీంతో, తాత్కాలికంగా నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. డిసెంబర్ 15న జరిగే తదుపరి విచారణలో ఎలాంటి తుది నిర్ణయం వెలువడుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories