Rishab Shetty : కౌన్ బనేగా కరోడ్‌పతిలో రిషబ్ శెట్టి మెరుపులు.. రూ.12.5 లక్షలు, హీరో బైక్ గెలుపు

Rishab Shetty : కౌన్ బనేగా కరోడ్‌పతిలో రిషబ్ శెట్టి  మెరుపులు.. రూ.12.5 లక్షలు, హీరో బైక్ గెలుపు
x

 Rishab Shetty : కౌన్ బనేగా కరోడ్‌పతిలో రిషబ్ శెట్టి మెరుపులు.. రూ.12.5 లక్షలు, హీరో బైక్ గెలుపు

Highlights

చాప్టర్ 1 చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఇప్పుడు మరో కొత్త వేదికపై మెరిశారు.

Rishab Shetty : కాంతార: చాప్టర్ 1 చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఇప్పుడు మరో కొత్త వేదికపై మెరిశారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నిర్వహించే ప్రముఖ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి(KBC)లో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ షోలో రిషబ్ శెట్టి ఎంత డబ్బు గెలిచారు, ఆయనకు ఎలాంటి బహుమతులు లభించాయి అనే విషయాలపై పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.

రిషబ్ శెట్టి కేబీసీ షోకు ప్రత్యేక అతిథిగా వచ్చారు. అమితాబ్ బచ్చన్‌ను చూసి రిషబ్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ఈ సందర్భంగా రిషబ్ మాట్లాడుతూ.. "నాకు ఒక ఫౌండేషన్ ఉంది. అది రిషబ్ ఫౌండేషన్. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, దైవ నర్తకులకు సహాయం చేయాలనుకుంటున్నాను" అని చెప్పారు. రిషబ్ మాటలు విని అమితాబ్ ఎంతగానో సంతోషాన్ని వ్యక్తం చేశారు.

రిషబ్ శెట్టికి మొదటి ప్రశ్న రూ.50,000 కోసం అడిగారు. అది లాఫింగ్ బుద్ధకి సంబంధించిన ప్రశ్న. దీనికి ఆయన సరైన సమాధానం ఇచ్చారు. మొత్తం 12 ప్రశ్నలను రిషబ్ శెట్టి ఎదుర్కొన్నారు. ఇండోనేషియాలోని సజీవ అగ్నిపర్వతం కింద ఉన్న హిందూ దేవుడు ఎవరు? అని 12వ ప్రశ్న అడిగారు. దీనికి రిషబ్ లైఫ్‌లైన్ ఉపయోగించి, గణపతి అని సరైన సమాధానం ఇచ్చారు. ఈ విధంగా ఆయన రూ.12,50,000 గెలుచుకున్నారు. ఆ తర్వాత అమితాబ్.. "మీ ఫౌండేషన్‌కు హీరో ఎక్స్‌ట్రీమ్ 125 బైక్ కూడా లభిస్తుంది" అని ప్రకటించారు.

ఆ తర్వాత సమయం పూర్తవడంతో షో ఆగిపోయింది. అమితాబ్ బచ్చన్ గెలిచిన రూ.12.5 లక్షలను రిషబ్ ఫౌండేషన్ ఖాతాకు బదిలీ చేశారు. ఇది కాకుండా స్పాన్సర్‌ల తరపున రిషబ్ ఫౌండేషన్‌కు 1500 కిలోల బియ్యం, 1500 కిలోల గోధుమలు, 1500 కిలోల నెయ్యిను కూడా బహుమతిగా ఇస్తున్నట్లు అమితాబ్ ప్రకటించారు. ఈ బహుమతులన్నీ రిషబ్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, దైవ నర్తకుల సంక్షేమం కోసం ఉపయోగపడతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories