Biggboss 9 : ఎందుకు పంపిస్తున్నారంటూ నాగార్జున ముందే బోరున ఏడ్చేసిన రీతూ.. ఫినాలే గెస్ట్‎గా చిరంజీవి ?

Biggboss 9 : ఎందుకు పంపిస్తున్నారంటూ నాగార్జున ముందే బోరున ఏడ్చేసిన రీతూ.. ఫినాలే గెస్ట్‎గా చిరంజీవి ?
x

Biggboss 9 : ఎందుకు పంపిస్తున్నారంటూ నాగార్జున ముందే బోరున ఏడ్చేసిన రీతూ.. ఫినాలే గెస్ట్‎గా చిరంజీవి ?

Highlights

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి అంకానికి చేరుకుంటున్న నేపథ్యంలో ఆదివారం ఎపిసోడ్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంటున్న రీతూ చౌదరి ఎలిమినేట్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Biggboss 9 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి అంకానికి చేరుకుంటున్న నేపథ్యంలో ఆదివారం ఎపిసోడ్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంటున్న రీతూ చౌదరి ఎలిమినేట్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తను టాప్ కంటెస్టెంట్స్‌లో నిలుస్తుందని అభిమానులు ఆశించినప్పటికీ, ఉన్నట్టుండి ఎలిమినేట్ కావడంతో హౌస్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎలిమినేషన్ ప్రకటించగానే రీతూ కన్నీరు పెట్టుకుంది. "బిగ్ బాస్ ఎందుకు నన్ను ఎలిమినేట్ చేశారు? ఇంకా ఉండాలని ఉంది!" అంటూ ఆవేదనగా అడిగింది. తర్వాత కొద్దిసేపటికి తేరుకుని, "లవ్ యూ బిగ్ బాస్, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్" అంటూ హౌస్‌మేట్స్‌కు వీడ్కోలు చెప్పింది. రీతూ ఎలిమినేషన్ పవన్, తనూజలను బాగా కలచివేసింది, వారిద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

రీతూ హౌస్ నుండి బయటకు వెళ్లే ముందు, తన దృష్టిలో టాప్-7 స్థానాలకు అర్హులైన కంటెస్టెంట్స్ లిస్ట్‌ను ప్రకటించింది. మొదటి స్థానానికి డీమాన్ పవన్ అర్హుడని స్పష్టం చేసిన రీతూ, రెండు, మూడు, నాలుగు స్థానాలను ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, తనూజలలో ఎవరైనా పంచుకోవచ్చని చెప్పింది. ఆరో స్థానంలో సుమన్ శెట్టిని, ఏడో స్థానంలో భరణిని ఉంచింది. అలాగే, తన మిత్రుడైన పవన్‌ను జాగ్రత్తగా చూసుకోమని, ముఖ్యంగా కళ్యాణ్ పవన్‌తో మాట్లాడటం లేదని, అతనితో మాట్లాడాలని కోరింది.

ఆదివారం ఎపిసోడ్‌లో ఫన్ గేమ్స్‌తో పాటు ఎలిమినేషన్ ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. నాగార్జున వివిధ టాస్క్‌ల ద్వారా భరణి, సుమన్ శెట్టిలను సేఫ్ చేసి, చివరకు సంజన, రీతూలతో బాంబు కట్ టాస్క్ నిర్వహించారు. ఈ టాస్క్‌లో రీతూ ఎలిమినేట్ అయింది. ప్రస్తుతం విన్నర్ రేసులో సీరియల్ బ్యూటీ తనూజ అత్యధిక ఓటింగ్‌తో దూసుకుపోతోంది. ఆమెకు గట్టి పోటీ ఇస్తూ ఇప్పటికే టికెట్ టు ఫినాలే గెలుచుకున్న కళ్యాణ్ కూడా విన్నర్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories