లాభాల బాటలో రోషన్ కనకాల ‘మోగ్లీ’

లాభాల బాటలో రోషన్ కనకాల ‘మోగ్లీ’
x
Highlights

రోషన్ కనకాల హీరోగా నటించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మోగ్లీ’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తూ లాభాల బాటలో దూసుకుపోతోంది.

రోషన్ కనకాల హీరోగా నటించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మోగ్లీ’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తూ లాభాల బాటలో దూసుకుపోతోంది. విడుదలైన తొలి వారం రోజుల్లోనే బ్రేక్‌ఈవెన్‌ను దాటిన ఈ చిత్రం, రెండో వారంలోకి అడుగుపెట్టే సమయానికి నిర్మాతలకు లాభాలు తీసుకొస్తోంది.

సెన్సిబుల్ బడ్జెట్‌తో రూపొందిన ‘మోగ్లీ’ థియేట్రికల్‌తో పాటు నాన్‌థియేట్రికల్ వసూళ్లను కలుపుకొని దాదాపు రూ.10 కోట్ల ఆదాయాన్ని సాధించినట్లు సమాచారం. దీంతో చిత్ర నిర్మాణ సంస్థకు మంచి ప్రాఫిట్ లభించింది.

కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చి రూపొందించిన చిన్న బడ్జెట్ సినిమాలు కూడా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ విజయం సాధించగలవని ‘మోగ్లీ’ మరోసారి నిరూపించింది. ఈ చిత్రంలో రోషన్ కనకాల యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అతని నటనకు విశేషమైన ప్రశంసలు లభించగా, హీరోగా ఇది రోషన్‌కు తొలి ఘన విజయంగా నిలిచింది.

విలన్ పాత్రలో బండి సరోజ్ కుమార్ చేసిన నటనకు కూడా మంచి స్పందన వచ్చింది. దర్శకుడు సందీప్ రాజ్ అనుకున్న బడ్జెట్‌లోనే సినిమాను పూర్తి చేయగా, కేవలం రూ.8 కోట్ల బడ్జెట్‌తో టాప్ క్వాలిటీలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

TG విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ‘మోగ్లీ’, చిన్న మరియు మధ్య స్థాయి బడ్జెట్ సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహాన్ని అందించిన చిత్రంగా నిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories