ధర్మేంద్ర మృతి అంటూ వార్తలు.. ఖండించిన ఈషా దేవోల్‌, ఆగ్రహించిన హేమా మాలిని

ధర్మేంద్ర మృతి అంటూ వార్తలు.. ఖండించిన ఈషా దేవోల్‌, ఆగ్రహించిన హేమా మాలిని
x
Highlights

ధర్మేంద్ర మృతి వార్తలు తప్పుడు! కుమార్తె ఈషా దేవోల్ స్పష్టత ఇచ్చారు, హేమా మాలిని మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మేంద్ర ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది.

బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర మరణించారంటూ మంగళవారం ఉదయం సోషల్ మీడియా, కొన్ని జాతీయ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలు తప్పుడు అని ఆయన కుమార్తె ఈషా దేవోల్ స్పష్టంచేశారు.

ఈషా దేవోల్ క్లారిటీ

ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వదంతులను ఆమె ఖండించారు.

“మా నాన్న క్షేమంగానే ఉన్నారు. ప్రస్తుతం ముంబయి బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. మా కుటుంబం చెప్పేవరకు ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయొద్దు. మా ప్రైవసీని గౌరవించండి. నాన్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన అందరికీ ధన్యవాదాలు.” అని ఈషా దేవోల్ సోషల్ మీడియాలో తెలిపారు.

హేమా మాలిని ఆగ్రహం

ధర్మేంద్ర భార్య హేమా మాలిని ఫేక్ న్యూస్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఇది క్షమించరానిది. చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్న వ్యక్తి గురించి బాధ్యతాయుతమైన మీడియా ఇలాంటి వార్తలు ఎలా ప్రచారం చేస్తుంది? ఇది పూర్తిగా బాధ్యతారాహిత్య ప్రవర్తన.” అని ఆమె మండిపడ్డారు.

ప్రస్తుత పరిస్థితి

ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ధర్మేంద్ర చికిత్స కొనసాగుతోంది. వైద్యుల ప్రకారం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ వర్గాలు స్పష్టం చేశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories