Saiyaara Movie Record: సూపర్ హిట్ ‘సైయారా’.. వరల్డ్ వైడ్‌గా రూ.256 కోట్లు వసూల్

Saiyaara Movie Record
x

Saiyaara Movie Record: సూపర్ హిట్ ‘సైయారా’.. వరల్డ్ వైడ్‌గా రూ.256 కోట్లు వసూల్

Highlights

Saiyaara Movie Record: అది బాలీవుడ్ సినిమా. కానీ ఇప్పుడు దేశమంతా వినిపిస్తున్న పేరు సైయారా. ఇది ఒక చిన్న సినిమానే అయినా ఇండియా వైడ్ రూ.200 కోట్లు వసూలు చేస్తే.. వరల్డ్ వైడ్‌గా రూ. 43 కోట్లు వసూలు చేసింది.

Saiyaara Movie Record: అది బాలీవుడ్ సినిమా. కానీ ఇప్పుడు దేశమంతా వినిపిస్తున్న పేరు సైయారా. ఇది ఒక చిన్న సినిమానే అయినా ఇండియా వైడ్ రూ.200 కోట్లు వసూలు చేస్తే.. వరల్డ్ వైడ్‌గా రూ. 43 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ. 256 కోట్లు సంపాదించి రికార్డ్ సృష్టించింది.

చిన్న సినిమా అయినా సూపర్ డూపర్ హిట్ కావడంతో దేశమంతా ఇప్పుడు సైయారానే చూస్తున్నాయి. కొన్ని రోజుల్లో వందల కోట్లు వసూలు చేయడంతో బాలీవుడ్‌కు మంచి హిట్ వచ్చిందని అభిమానులు సంబంర పడుతున్నారు. మరోవైపు ఈ అనూహ్య విజయం పట్ట ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనుకున్న స్థాయిని ఈ సినిమా మించిపోయిందని తెగ సంబరం పడుతున్నారు.

ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది మోహిత్ సూరి. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా అహాన్ పాండే, అనిత్ పడ్డా నటించారు. అయితే ఈ చిత్రం స్పెషాలిటీ ఏంటంటే ఇదొక చిన్న చిత్రం. అలాగే ఇందులో నటించివారు కూడా కొత్త నటులు. ఈ సినిమాకు ఎటువంటి ప్రచారం కూడా లేదు. అయినా ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట.. సైయారా.

ఈ సినిమా కథ కూడా కొత్త కథేమీ కాదు. రెగ్యులర్ కథే. క్రిష్ కపూర్ అనే వ్యక్తికి సంగీతం అంటే ఇష్టం. గొప్ప కంపోజర్ కావాలనుకుంటాడు. అయితే ఒకానొక సందర్భంలో క్రిష్‌ని చూసిన జర్నలిస్ట్ వాణీ అతడ్ని ఇష్టపడుతుంది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆమె మాజీ ప్రియుడు మళ్లీ ఆమె జీవితంలోకి వస్తాడు. ఇక అప్పటి నుంచి టర్నింగ్స్‌తో సినిమా ముందుకు సాగిపోతుంది. చాలా కూల్‌గా, రొమాంటిక్ ఫీల్‌తో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా చూసినవాళ్లెవరైనా మంచి భావోద్వేగానికి ఫీల్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఈ సినిమా దేశంలోనే కాదు వరల్డ్ వైడ్‌గా కూడా హిట్ కొడుతుండడంతో చిత్ర యూనిట్ అంతా సంబరాల్లో మునిగిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories