Saiyaara OTT: బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సైయారా ఇప్పుడు ఓటీటీలో.. ఎక్కడ చూడొచ్చో తెలుసా?

Saiyaara OTT: బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సైయారా ఇప్పుడు ఓటీటీలో.. ఎక్కడ చూడొచ్చో తెలుసా?
x
Highlights

ప్రస్తుతం ప్రతి వారం వందలాది సినిమాలు విడుదలవుతున్నా.. విజయాలు మాత్రం కొద్దిపాటి చిత్రాలకే పరిమితమవుతున్నాయి. పెద్ద తారాగణం, భారీ యాక్షన్ సీన్స్ ఉన్నా కథ బలహీనంగా ఉంటే ప్రేక్షకులు సినిమాను తిరస్కరిస్తున్నారు. మరోవైపు, ఎలాంటి స్టార్ కాస్ట్ లేకపోయినా కంటెంట్ బలంగా ఉంటే చిన్న సినిమాలను కూడా ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇటీవల విడుదలైన హార్ట్ బీట్ సినిమా ఇందుకు మంచి ఉదాహరణ.

ప్రస్తుతం ప్రతి వారం వందలాది సినిమాలు విడుదలవుతున్నా.. విజయాలు మాత్రం కొద్దిపాటి చిత్రాలకే పరిమితమవుతున్నాయి. పెద్ద తారాగణం, భారీ యాక్షన్ సీన్స్ ఉన్నా కథ బలహీనంగా ఉంటే ప్రేక్షకులు సినిమాను తిరస్కరిస్తున్నారు. మరోవైపు, ఎలాంటి స్టార్ కాస్ట్ లేకపోయినా కంటెంట్ బలంగా ఉంటే చిన్న సినిమాలను కూడా ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇటీవల విడుదలైన హార్ట్ బీట్ సినిమా ఇందుకు మంచి ఉదాహరణ. పెద్ద సెట్స్ లేకపోయినా, యాక్షన్ సీన్స్ లేకపోయినా.. పూర్తిగా కామెడీతో ఆ సినిమా భారీ విజయం సాధించింది.

ఇక బాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సయ్యారా సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది.

ఆహాన్ పాండే, అనీత్ పద్ద హీరో–హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. రిలీజ్ వరకు ఎలాంటి హైప్ లేకపోయినా.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.580 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. సింపుల్ లవ్ స్టోరీ, మ్యూజికల్ టచ్, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఇక ఈ బ్లాక్‌బస్టర్ మూవీ నేటి (సెప్టెంబర్ 12) నుంచి నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్‌లో చూడలేకపోయినవారు ఇప్పుడు ఇంట్లోనే కంఫర్ట్‌గా ఎంజాయ్ చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories