Salman Khan: జైల్లో ఉన్నప్పుడే హాయిగా నిద్రపోయా.. ఇప్పుడు రోజుకు 2 గంటలే

Salman Khan Says He Sleeps Peacefully Only In Jail
x

 జైల్లో ఉన్నప్పుడే హాయిగా నిద్రపోయా.. ఇప్పుడు రోజుకు 2 గంటలే

Highlights

సల్మాన్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల సల్మాన్ ఖాన్.. సినిమాల కంటే వ్యక్తిగత విషయాల ద్వారానే ఎక్కువ వార్తల్లో నిలుస్తున్నారు.

Salman Khan: సల్మాన్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల సల్మాన్ ఖాన్.. సినిమాల కంటే వ్యక్తిగత విషయాల ద్వారానే ఎక్కువ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న సల్మాన్.. తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను చాలా తక్కువ నిద్ర పోతానని.. జైల్లో ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ నిద్రపోయానని చెప్పారు.

తాను సాధారణంగా రోజుకు 2 గంటలు మాత్రమే నిద్రపోతానని.. నెలకోసారి మాత్రమే 8 గంటలు పడుకుంటానని తెలిపారు. కొన్నిసార్లు సినిమా షూటింగ్ సమయంలో విరామం దొరికినప్పుడు కాస్త కునుకు తీస్తానని చెప్పారు. షూటింగ్ లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు కావాల్సినంత నిద్ర పోతానని అన్నారు. అందుకే జైల్లో ఉన్నప్పుడు హాయిగా 8 గంటలు నిద్రపోయానన్నారు. ఒకవేళ తాను ప్రయాణం చేసే విమానంలో సాంకేతి సమస్య వచ్చి అల్లకల్లోలం అయినా తాను మాత్రం నిద్రపోతానని అన్నారు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో ఏం చేయలేము కాబట్టి అంటూ నవ్వులు పూయించారు.

తాను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రోజులను గుర్తు చేసుకున్నారు సల్మాన్. తాను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తన తండ్రి యాక్షన్ చేయగలవా? పది మందిని కొడతావా? ఇలా ఎన్నో ప్రశ్నలు వేశారని.. లాయరో, పోలీసో కావచ్చు కాదా అని అన్నారని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. కానీ తాను మాత్రం యాక్టర్ కావాలని బలంగా అనుకున్నానని తెలిపారు. ఇండస్ట్రీలో పోటీ ఎక్కువగా ఉంటుంది. జీవితంలో సీరియస్‌గా ఉండాలి. తోటి నటులతో పోల్చుకుంటూ ముందుకు సాగాలి. కొత్త విషయాలను నేర్చుకుంటూ ముందుకు సాగడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. అయితే సల్మాన్ రోజుకు రెండు గంటలు మాత్రమే నిద్ర పోతానని చెప్పడంతో ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న అభిమానులు పలు సూచనలు చేస్తున్నారు. కనీసం 6 గంటలైనా నిద్రపోండి సర్ అంటూ సలహాలు ఇస్తున్నారు.

గతంలో కృష్ణ జింకను చంపినట్లుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న కేసులో సల్మాన్ ఖాన్ జైలుకు వెళ్లారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కృష్ణ జింకను ఆరాధ్య దైవంగా భావించే బిష్ణోయ్ వర్గం నుంచి హత్యా బెదిరింపులు మాత్రం తప్పడం లేదు. బెదిరింపుల కారణంగా రూ.2 కోట్ల విలువ చేసే బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా కొనుగోలు చేశారు. ముంబైలోని తన నివాసానికి పూర్తిగా బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్‌తో కప్పేశారు. ఇక సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సల్మాన్ సికిందర్ సినిమాలో నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories