Salman Khan: రామమందిరం డిజైన్‎తో సల్మాన్ ఖాన్ వాచ్...ధర ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెడతారు

Salman Khan: రామమందిరం డిజైన్‎తో సల్మాన్ ఖాన్ వాచ్...ధర ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెడతారు
x
Highlights

Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ వయస్సులోనూ కుర్ర హీరోలతో పోటీ పడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కు...

Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ వయస్సులోనూ కుర్ర హీరోలతో పోటీ పడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ కు పండగే. ఇప్పుడు రంజాన్ సందర్భంగా సికందర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాు. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో వరుస హిట్స్ తో ఫామ్ లో ఉన్నరష్మిక మంధాన హీరోయిన్ గా నటిస్తోంది. కాజల్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. గత కొన్నాళ్లుగా సల్మాన్ ఖాన్ సికిందర్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.

అయితే ఈ క్రమంలోనే ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ జాకబ్ అండ్ కో . ఎపిక్ ఎక్స్ రామ్ జన్మభూమి టైటానియం ఎడిషన్ 2 వాచ్ ను ధరించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అద్భుతమైన డిజైన్, ఆకర్షణీయమైన హస్తకళతో కూడిన ఈ వాచ్ ధర దాదాపు రూ. 60 లక్షలు ఉంటుందని అంచనా. జాకబ్ అండ్ కో వ్యవస్థాపకుడు చైర్మన్ జాకబ్ అరాబోతో సల్మాన్ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలో ఈ బాలీవుడ్ హీరో కొన్నేళ్లుగా ఈ కంపెనీ వాచ్ లను ధరిస్తూ వాటికి కావాల్సిన ప్రచారం కల్పిస్తున్నాడు. సినిమాల ద్వారా కూడా సల్మాన్ ఖాన్ ఈ వాచ్ లను ప్రమోట్ చేస్తున్నాడు.

జాకబ్ అండ్ కో కంపెనీ అధినేతతో సల్మాన్ బంధం ఇప్పటిది కాదు. వారిద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. ఓ సందర్భంలో జాకబ్ తండ్రి సల్మాన్ కు ఓ కానుక ఇచ్చాడు. ది వరల్డ్ ఈజ్ యువర్స్ థీమ్ తో ఇది ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అప్పటి నుంచి వారి బంధం మరింత బలంగా మారింది. సల్మాన్ జీవితంపై ఎంతో ప్రభావ చూపించిన అతని తండ్రి సలీంఖాన్ ను గౌరవించే ఒక ప్రత్యేకమైన టైమ్ పీస్ ను రూపొందించడంలోన జాకబ్ అండ్ కో ఎంతో సహకరించింది. సల్మాన్ కోసం, అతని తండ్రికోసం ప్రత్యేకమైన వాచ్ లను ఈ కంపెనీ తయారు చేసి అందిస్తుంది. సల్మాన్ ధరించిన రామ మందిరం డిజైన్ వాచ్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories