అత్తింట్లో సమంతకు గ్రాండ్ వెల్‌కమ్… రాజ్‌ సోదరి షేర్ చేసిన ఎమోషనల్ నోట్ వైరల్!

అత్తింట్లో సమంతకు గ్రాండ్ వెల్‌కమ్… రాజ్‌ సోదరి షేర్ చేసిన ఎమోషనల్ నోట్ వైరల్!
x

అత్తింట్లో సమంతకు గ్రాండ్ వెల్‌కమ్… రాజ్‌ సోదరి షేర్ చేసిన ఎమోషనల్ నోట్ వైరల్!

Highlights

స్టార్ హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగు వేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె కోయంబత్తూరులో వివాహ బంధంలోకి అడుగుపెట్టడంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

స్టార్ హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగు వేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె కోయంబత్తూరులో వివాహ బంధంలోకి అడుగుపెట్టడంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ జంటపై అభిమానులు చూపుతున్న ప్రేమ, ఆప్యాయత ప్రత్యేక ఆకర్షణగా మారింది.

డిసెంబర్ 2న సమంత అత్తింట్లోకి అడుగుపెట్టగా, నిడిమోరు కుటుంబం ఆమెకు ఘన స్వాగతం పలికింది. ఇదే విషయాన్ని రాజ్ సోదరి శీతల్ ఎంతో భావోద్వేగంతో సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎమోషనల్ నోట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

శీతల్ తన నోట్‌లో ఇలా రాసింది:

“సంతోషం మాటల్లో చెప్పలేనంతగా ఉంది. భక్తుడు తన అంతరంగాన్నంతా సమర్పిస్తూ శివలింగాన్ని ఆలింగనం చేసుకునే ఆనందం నాకు ఈ రోజు అనుభవం అయ్యింది. మా కుటుంబం పరిపూర్ణమైంది. సమంత–రాజ్‌ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతుండడం చూస్తే గర్వంగా ఉంది. పరస్పర గౌరవం, నిజాయితీతో జీవితం నిర్మిస్తే అది శాంతితో నిండిపోతుంది. మేము వీరికి ఎప్పుడూ అండగా ఉంటాము.” అని పేర్కొంది.

అలాగే ఈషా ఫౌండేషన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ తన పోస్ట్‌ను ముగించింది. ఆమె రాసిన ఈ ప్రేమపూర్వక సందేశానికి సమంత కూడా వెంటనే స్పందిస్తూ “Love you” అంటూ హృదయపూర్వక రిప్లై ఇచ్చింది.

సమంత–రాజ్ వివాహం: ప్రత్యేకతలేంటి?

డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్ లోని లింగ భైరవి ఆలయంలో వీరి వివాహం జరిగింది. సంప్రదాయ పద్దతుల్లో జరిగిన ఈ పెళ్లిలో సమంత ఎర్ర చీరలో మెరిసిపోగా, రాజ్ క్రీమ్–గోల్డ్ కుర్తాలో అందరినీ ఆకర్షించారు. దీంతో పాటు సమంత ధరించిన వెడ్డింగ్ రింగ్ మొఘల్ కాలానికి చెందిన ప్రత్యేక డిజైన్ కావడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

వారి వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, నిడిమోరు కుటుంబం నుంచి వచ్చిన ఈ ప్రేమపూర్వక స్వాగతం అభిమానుల హృదయాలు దోచుకుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories