Samantha: చెన్నై స్టోరీ తో హాలీవుడ్​లోకి సమంత ఎంట్రీ..

Samantha: చెన్నై స్టోరీ తో హాలీవుడ్​లోకి సమంత ఎంట్రీ..
x

Samantha: హాలీవుడ్ సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్..త్వరలోనే షూటింగ్

Highlights

శాకుంతలం చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సమంత..ప్రస్తుతం విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఖుషి సినిమా చేస్తోంది. అంతేకాదు, సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తోంది.

Samantha: టాలీవుడ్ అగ్ర హీరోయిన్స్ లో సమంత ఒకరు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్ధ కాలం దాటినా ఇప్పటికే సమంతకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఓవైపు పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తోంది. నాగచైతన్యతో పెళ్లి, ఆ తర్వాత విడాకులు..ఇవేవీ సమంత కెరీర్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపలేదు. నిజం చెప్పాలంటే విడాకుల తర్వాత సమంత స్పీడు పెంచిందనే చెప్పాలి.

ఇటీవలే శాకుంతలం చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చెన్నై సోయగం..ప్రస్తుతం విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఖుషి సినిమా చేస్తోంది. అంతేకాదు, సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నటిస్తోంది. త్వరలో విడుదల కానున్న ఈ వెబ్ సిరీస్ తో సమంత క్రేజ్ మరింత పెరగడం ఖాయం కాగా తాజాగా ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

హాలీవుడ్ టెలివిజన్ షోలకు పని చేసిన ఫిలిప్ జాన్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ ప్రాజెక్ట్ లో ఇంగ్లాండ్ నటుడు వివేక్ కల్రా హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి చెన్నై స్టోరీ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమా కథ విషయానికొస్తే..లండన్ లో స్థిరపడిన ఓ ఎన్ ఆర్ ఐ..తన తండ్రిని వెతికే క్రమంలో చెన్నై వస్తాడు. అక్కడ అతనికి హీరోయిన్ పరిచయం అవుతుంది. తప్పిపోయిన తన తండ్రిని వెతకడంతో హీరోకి హీరోయిన్ ఏ విధంగా సాయపడింది..ఇద్దరి మధ్యన ఏం జరిగింది అనే కాన్సెప్ట్ తో చెన్నై స్టోరీని తెరకెక్కిస్తారని తెలుస్తోంది.

చెన్నై స్టోరీకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందట. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. మొత్తానికి, మన స్టార్ హీరోలు హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో సమంత ఏకంగా హాలీవుడ్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి..త్వరలోనే షూటింగ్ కి రెడీ అవ్వడం నిజంగా బిగ్ వండర్ అనే చెప్పాలి. ఇక, సమంత తెలుగులో నటిస్తున్న ఖుషి మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories