Samantha : సన్నగా అయిపోయావ్ అన్నవారికి.. కండల ఫోటోతో సమంత షాక్.. వామ్మో ఈ ఫిట్‌నెస్ చూశారా?

Samantha : సన్నగా అయిపోయావ్ అన్నవారికి.. కండల ఫోటోతో సమంత షాక్..  వామ్మో ఈ ఫిట్‌నెస్ చూశారా?
x

Samantha : సన్నగా అయిపోయావ్ అన్నవారికి.. కండల ఫోటోతో సమంత షాక్.. వామ్మో ఈ ఫిట్‌నెస్ చూశారా?

Highlights

నటి సమంతా రూత్ ప్రభు తన వృత్తి జీవితంలోనే కాకుండా, వ్యక్తిగత జీవితంలోనూ అనేక సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, ఆమె గతంలో కంటే చాలా సన్నగా కనిపించారు.

Samantha : నటి సమంతా రూత్ ప్రభు తన వృత్తి జీవితంలోనే కాకుండా, వ్యక్తిగత జీవితంలోనూ అనేక సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, ఆమె గతంలో కంటే చాలా సన్నగా కనిపించారు. దీంతో కొంతమంది నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. అయితే, ఆ అనారోగ్యం, విమర్శల మధ్య కూడా సమంత తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడం ఆపలేదు. తాజాగా ఆమె ట్రోలర్స్‌కు గట్టి సమాధానం ఇస్తూ, తన బ్యాక్ మజిల్స్‌ను చూపిస్తూ జిమ్‌లో తీసిన ఒక ఫోటోను షేర్ చేసింది. ఆమె శరీరాకృతిని చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ కొత్త ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జిమ్‌లో తీసిన ఈ ఫోటోలో సమంత బ్యాక్ పోజ్ ఇచ్చి, తన కండరాలను ప్రదర్శించింది. ఈ మజిల్స్ ద్వారా తాను ఎంత ఫిట్‌గా, బలంగా ఉన్నానో చెప్పకనే చెప్పింది. గతంలో ఇలాంటి దృఢమైన వీపు పొందడం తన జన్యువుల్లో లేదని, అది అసాధ్యమని సమంత అనుకునేదట. కానీ ఇప్పుడు పట్టుదల, నిరంతర శ్రమతో ఆ కండరాలను సాధించడం పట్ల ఆమె చాలా గర్వంగా ఉందని పోస్ట్‌లో వెల్లడించింది.



సమంత కేవలం తన ఫిట్‌నెస్‌ను ప్రదర్శించడమే కాకుండా, తన ఫాలోవర్లకు స్ఫూర్తినిచ్చే సందేశాన్ని కూడా ఇచ్చింది."శరీరానికి కండరాలను పెంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఎలా కనిపిస్తున్నారు అనే దానికంటే, మీరు ఎలా జీవిస్తున్నారు, ఎలా ముందుకు సాగుతున్నారు, వయసు పెరుగుతున్న కొద్దీ ఎలా ఆరోగ్యంగా ఉంటున్నారు అనేదే ముఖ్యం. వయసు పెరిగే కొద్దీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీ బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలి" అని ఆమె సూచించింది.

స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తనకు ఎంతో ఓర్పును, క్రమశిక్షణను నేర్పించిందని సమంత తెలిపింది. "ఒకవేళ మీరు కూడా ఇది నా వల్ల కాదు అని ప్రయత్నించడం మానేసే స్థితిలో ఉంటే, అలా చేయకండి. ప్రయత్నిస్తూ ముందుకు సాగండి. భవిష్యత్తు బాగుంటుంది" అంటూ ఆమె తన అభిమానుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ప్రస్తుతం సమంత దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా వెబ్ సిరీస్‌ల ద్వారా మంచి పేరు సంపాదించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories