
Vijay Divorce: హీరో విజయ్ కాపురంలో త్రిష చిచ్చు..? మొత్తం ఆమె చేసిందంటూ...!
Vijay and Trisha: తమిళ సినీ రంగంలోనే కాదు, అటు రాజకీయ వర్గాల్లోనూ ఇప్పుడు ఒకటే పేరు మారుమోగుతోంది.. అది 'దళపతి' విజయ్.
Vijay and Trisha: తమిళ సినీ రంగంలోనే కాదు, అటు రాజకీయ వర్గాల్లోనూ ఇప్పుడు ఒకటే పేరు మారుమోగుతోంది.. అది 'దళపతి' విజయ్. అయితే ఈసారి అది ఆయన సినిమా విజయం గురించో, పార్టీ ప్రస్థానం గురించో కాదు.. ఆయన వ్యక్తిగత జీవితంలో రేగిన ఒక పెను తుఫాను గురించి. విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు సంచలనంగా మారింది.సుమారు 25 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక బంధం తర్వాత, విజయ్ భార్య సంగీత చెంగల్‌పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ఆమె చేసిన ఆరోపణలు తమిళనాట ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
2021 నుంచి విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని సంగీత నేరుగా ఆరోపించారు. గత నాలుగేళ్లుగా విజయ్ కుటుంబానికి దూరంగా ఉంటున్నారని, భార్యగా తనకు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆమె పేర్కొన్నారు.తన భర్త ప్రవర్తనలో మార్పు కోరినప్పటికీ ఆయన పట్టించుకోలేదని, అందుకే ఇక కలిసి ఉండటం సాధ్యం కాదని ఆమె తేల్చి చెప్పారు. సంగీత తన పిటిషన్‌లో ఆ నటి పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ, నెటిజన్లు, రాజకీయ వర్గాల చూపు మాత్రం నటి త్రిష వైపు మళ్లుతోంది. దీనికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి.
తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ గతంలోనే విజయ్ త్రిష మత్తు నుంచి బయటకు రావాలి అని వ్యాఖ్యానించడం అప్పట్లో దుమారం రేపింది. త్రిష మాత్రం ఇప్పటికే ఈ ఆరోపణలను ఖండిస్తూ చట్టపరమైన చర్యలకు సిద్ధమని హెచ్చరించారు. వీరిద్దరూ కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో ప్రయాణించడం, లిఫ్ట్‌లో కలిసి ఉన్న ఫోటోలు వైరల్ కావడం, విజయ్ పుట్టినరోజున త్రిష ప్రత్యేకంగా పార్టీ ఇవ్వడం వంటివి ఈ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి.ఒకవేళ విజయ్ వర్గం నుంచి తనకు బెదిరింపులు వస్తే, ఆ హీరోయిన్ పేరును బహిరంగంగా బయటపెడతానని సంగీత హెచ్చరించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ, తనకంటూ ఒక కొత్త రాజకీయ పార్టీని (TVK) స్థాపించిన విజయ్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. వ్యక్తిగత ఆరోపణలు ఆయన రాజకీయ భవిష్యత్తును ఏ మేరకు ప్రభావితం చేస్తాయన్నది చర్చనీయాంశంగా మారింది.విజయ్ నుంచి ఈ వ్యవహారంపై ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




