సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ ఎప్పుడో చెప్పేసిన అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎప్పుడంటే..

Sankranthiki vastunnam movie sequel annoncement by director Anil Ravipudi
x

సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ ఎప్పుడో చెప్పేసిన అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎప్పుడంటే..

Highlights

Sankranthiki vastunnam sequel: హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతోంది....

Sankranthiki vastunnam sequel: హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతోంది. తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకుని భారీ లాభాలను రాబడుతోంది. ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్‌ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సీక్వెల్ పై అనిల్ ప్రకటన చేశారు. మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం అని అన్నారు. దీంతో సంక్రాంతికి వస్తున్నాం2 నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికే అని అంతా ఫిక్సయ్యారు.

సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుందని మూవీ చివరిలోనే హింట్ ఇచ్చిన అనిల్ రావిపూడి.. అందుకోసం పక్కా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంటర్వ్యూలో అనిల్ దీన్నే డిఫరెంట్ సిచ్యువేషన్స్‌కి తగినట్టుగా చేయొచ్చు.. అలానే రాజమండ్రిలో ఎండ్ చేశాం కాబట్టి అక్కడి నుంచే స్టోరీ స్టార్ట్ కావొచ్చు.. ఏమో మరో అద్భుతం చేస్తామేమో అంటూ చెప్పుకొచ్చారు. అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అనౌన్స్ మెంట్లోనే అనిల్ రావిపూడి టైటిల్ చెప్పేశారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రెండు, మూడు సార్లు అనిల్ మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం అన్నారు. దీంతో అదే టైటిల్‌తో వచ్చే ఏడాది సీక్వెల్ రాబోతుందంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబో సూపర్ హిట్ అని మరోసారి రుజువు చేశారు. వీళ్ల కాంబోలో గతంలో వచ్చిన F2, F3 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ పండగకు సంక్రాంతికి వస్తున్నాం అంటూ బ్లాక్ బస్టర్ కొట్టేశారు. ముఖ్యంగా వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిలిచింది. ఇప్పటికే రూ.161 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా.. మరో రెండు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.

వెంకటేష్ హీరోగా మీనాక్షి చౌదరీ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి14న విడుదలైది. ఫన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొంది ఆడియన్స్‌ని విశేషంగా అలరించింది. ఇందులో నరేష్, గణేష్, మురళీధర్ గౌడ్, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఈ సినిమా హిట్‌తో మరోసారి వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా తన మార్క్ చూపించారు. థియేటర్‌కి ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా వస్తుండడం ఈ సినిమాకి గొప్ప సక్సెస్ అంటూ మూవీ టీమ్ అభిప్రాయపడింది. మొత్తానికి చిన్న సినిమాగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం పెద్ద హిట్ కావడం విశేషం. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీక్వెల్‌‌ను అనిల్ రావిపూడి ఇంకెంత ఫన్‌గా తీస్తారో చూడాలి మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories