రూ.200 కోట్ల క్లబ్బులోకి సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీ జోరు మామూలుగా లేదుగా

Sankranthiki vastunnam collections
x

రూ.200 కోట్ల క్లబ్బులోకి సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీ జోరు మామూలుగా లేదుగా

Highlights

Sankranthiki vastunnam collections: వెంకీ అభిమానులకు సంక్రాంతి కానుకగా రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు...

Sankranthiki vastunnam collections: వెంకీ అభిమానులకు సంక్రాంతి కానుకగా రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ పట్టం కడుతున్నారు. దీంతో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.

సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీకి వరల్డ్ వైడ్‌గా మంచి రెస్పాన్స్ వస్తోంది. మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ల్‌లో చేరి సంచలనం సృష్టించిన ఈ సినిమా.. కేవలం వారం రోజుల్లోనే రూ.200 కోట్ల కబ్ల్‌లో అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది.

తెలుగులో వెంకటేష్‌కు కుటుంబ ప్రేక్షకులతో పాటు అందరి హీరోల అభిమానులు వెంకీ సినిమాలను ఇష్టపడుతుంటారు. అయితే హీరోగా వెంకటేష్ పని అయిపోయింది అనుకున్న వాళ్లకు సంక్రాంతికి వస్తున్నాంతో గట్టి సమాధానమే ఇచ్చారు వెంకటేష్. ఫ్యామిలీస్‌‌లో తన పట్టు ఇంకా చెక్కు చెదరలేదని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.

గతంలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలు కూడా రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించినా అందులో వరుణ్ తేజ్ మరో హీరోగా ఉన్నాడు. కానీ సింగిల్‌గా వెంకీ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి బరిలో బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అందుకొని లాభాల్లోకి వచ్చేసింది. మొత్తంగా టాలీవుడ్‌‌లో వెంకటేష్, అనిల్ రావిపూడి హాట్రిక్ హిట్స్ అందుకుని సంచలనం సృష్టించారు. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 3 మిలియన్ క్లబ్బులో ప్రవేశించనుంది.

ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. సీనియర్ నటుడు నరేష్, వీటీ గణేశ్, సాయి కుమార్, మురళీ, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరోలియో చక్కటి సంగీతం అందించగా.. శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని రూపొందించారు.

మొత్తంగా తక్కువ బడ్జెట్‌తో అతి తక్కువ సమయంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా అతిపెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా రెండో వారంలోనూ అదే జోరు చూపిస్తుందా? ఫైనల్‌గా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా తన పరుగును ఎక్కడ ఆపుతుందో చూడాలి మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories