logo
సినిమా

మెగా హీరోలతో సినిమా ప్లాన్ చేస్తున్న సంతోష్ శ్రీనివాస్

Santosh Srinivas Planning Movie With Mega Heroes
X

మెగా హీరోలతో సినిమా ప్లాన్ చేస్తున్న సంతోష్ శ్రీనివాస్

Highlights

Santhosh Srinivas: సినిమాటోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంతోష్ శ్రీనివాస్ రామ్ హీరోగా నటించిన "కందిరీగ" సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

Santhosh Srinivas: సినిమాటోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంతోష్ శ్రీనివాస్ రామ్ హీరోగా నటించిన "కందిరీగ" సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న సంతోష్ శ్రీనివాస్ పేరు టాలీవుడ్ లో బాగానే మారు మోగింది. ఆ తరువాత ఎన్టీఆర్ తో "రభస" అనే సినిమాని తెరకెక్కించారు కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ తరువాత మళ్ళీ రామ్ తో "హైపర్" సినిమా చేశారు కానీ అది కూడా అనుకున్న ఫలితాలను ఇవ్వలేకపోయింది. ఐదేళ్ల తర్వాత సాయి శ్రీనివాస్ హీరోగా "అల్లుడు అదుర్స్" సినిమా కి దర్శకత్వం వహించారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సారి సంతోష్ శ్రీనివాస్ మెగా మేనల్లుడు తో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారట. సాయి తేజ్ మరియు వైష్ణవ్ తేజ్ లకు కథను నరేట్ చేయడానికి సంతోష్ శ్రీనివాస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరిలో ఎవరు ఓకే అంటే సినిమా వాళ్లతో తీద్దామని సంతోష్ శ్రీనివాస్ ప్లాన్.

అయితే ప్రస్తుతం వరుస డిజాస్టర్ తో సాయి తేజ్ ఇబ్బందులు పడుతున్నారు. కొత్త జోనర్లో సినిమా తీసి హిట్ అందుకోవాలని తపన పడుతున్నారు. మరోవైపు వైష్ణవ్ తేజ్ కూడా కమర్షియల్ సినిమాలతో పాటు కొత్తగా ఉండే కథలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరైనా సంతోష్ శ్రీనివాస్ కి ఓకే చెప్తారో లేదో చూడాలి.

Web TitleSantosh Srinivas Planning Movie With Mega Heroes
Next Story