Sardar 2 Teaser OUT: బ్లాక్‌ డాగర్‌ నుంచి సర్దార్ దేశాన్ని ఎలా కాపాడాడు.. ఆసక్తికరంగా 'సర్దార్‌2' టీజర్‌

Sardar 2 Teaser OUT: బ్లాక్‌ డాగర్‌ నుంచి సర్దార్ దేశాన్ని ఎలా కాపాడాడు.. ఆసక్తికరంగా సర్దార్‌2 టీజర్‌
x
Highlights

Sardar 2 Teaser OUT: కార్తీ హీరోగా 2022లో వచ్చిన సర్దార్‌ మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Sardar 2 Teaser OUT: కార్తీ హీరోగా 2022లో వచ్చిన సర్దార్‌ మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో కార్తీ డ్యూయల్ రోల్‌లో నటించి మెప్పించాడు. పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో, రా ఏజెంట్ పాత్రలో తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేశాడు. ఈ సినిమా ఊహించిన దాని కంటే ఎక్కువ విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోంది.

సర్దార్‌2 పేరుతో ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్‌ ఓ ఆసక్తికర వీడియోను విడుదల చేవారు. ‘ప్రోలాగ్’ పేరుతో విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

2022లో విడుదలైన ‘సర్దార్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా చిత్రబృందం సినిమాలో విలన్‌గా నటించే ఎస్‌జే సూర్య లుక్‌ను రివీల్ చేస్తూ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. మిషన్ కంబోడియా నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని సమాచారం.

బ్లాక్‌ డాగర్‌ (ఎస్‌జే సూర్య) నుంచి భారత దేశానికి ఎలాంటి ముప్పు పొంచి ఉంది.? దీని నుంచి దేశాన్ని సర్దార్‌ ఎలా కాపాడాడు అన్న ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. యువన్ శంకర్ రాజా సంగీతం, జార్జ్ విల్లియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories