Shahrukh Khan: ఇన్‌కం ట్యాక్స్ కేసులో షారూఖ్‌ ఖాన్‌కు బిగ్ రిలీఫ్

Shahrukh Khan Wins Tax Case AS Tribunal Rules IN His Favour
x

ఇన్‌కం ట్యాక్స్ కేసులో షారూఖ్‌ ఖాన్‌కు బిగ్ రిలీఫ్

Highlights

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. ఇన్‌కం ట్యాక్స్ కేసు విషయంలో షారూఖ్ ఖాన్‌కి అనుకూలంగా తీర్పు వచ్చింది.

Shahrukh Khan: బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. ఇన్‌కం ట్యాక్స్ కేసు విషయంలో షారూఖ్ ఖాన్‌కి అనుకూలంగా తీర్పు వచ్చింది. షారూఖ్ ఖాన్ నటించిన రా వన్ సినిమా షూటింగ్ దాదాపుగా 70 శాతానికి పైగా యూకేలో జరిగింది. దీంతో ఈ సినిమాకి సంబంధించిన ట్యాక్స్ వివరాలు యూకే దేశ టర్మ్స్ అండ్ కండీషన్స్ పై ఆధారపడి ఉంటాయి.

అయితే 2011-2012 సంవత్సరానికిగానూ రూ.83.42 కోట్లు పన్ను చెల్లిస్తున్నట్టు.. అలాగే యూకేలో చెల్లించే ట్యాక్స్ విషయంలో విదేశీ క్రెడిట్స్ కోసం షారూఖ్ ఖాన్ దరఖాస్తు చేసున్నాడు. కానీ ఇన్‌కం ట్యాక్స్ అధికారులు ఈ దరఖాస్తును తిరస్కరించారు. అంతేకాకుండా 4ఏళ్ల తర్వాత ఈ ట్యాక్స్ మొత్తం రూ.84.17 కోట్లు అని మొత్తం ట్యాక్స్ కట్టాలని అధికారులు షారూఖ్ ఖాన్‌కి తెలిపారు.

దీంతో షారూఖ్ ఇన్ కం ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ని ఆశ్రయించారు. అయితే ఈ పన్ను చెల్లింపుల విషయంలో ఇన్ కం ట్యాక్స్ అధికారులు ఈ కేసును పరిశీలించారు. ఇందులో భఆగంగా షారూక్ ఖాన్‌కి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. అలాగే కేసు నమోదైన 4ఏళ్ళ తర్వాత మళ్లీ రీ కరెక్షన్ చెయ్యడం సరికాదని ఇన్ కం ట్యాక్స్ అధికారులకు ITAT చురకలంటించింది. దీంతో షారూక్‌కు ఈ విషయంలో బిగ్ రిలీఫ్ లభించిందని చెప్పొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories