MM Keeravani: కీరవాణి ఇంట విషాదం

MM Keeravani: కీరవాణి ఇంట విషాదం
x

MM Keeravani: కీరవాణి ఇంట విషాదం

Highlights

MM Keeravani: ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి, ప్రముఖ సినీ రచయిత శివశక్తి దత్తా (92) సోమవారం రాత్రి మణికొండలోని తన నివాసంలో కన్నుమూశారు.

MM Keeravani: ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి, ప్రముఖ సినీ రచయిత శివశక్తి దత్తా (92) సోమవారం రాత్రి మణికొండలోని తన నివాసంలో కన్నుమూశారు. శివశక్తి దత్తా అసలు పేరు కోడూరి సుబ్బారావు. 1932 అక్టోబర్ 8న రాజమహేంద్రవరం సమీపంలోని కొవ్వూరులో జన్మించిన ఆయన, చిన్ననాటి నుంచే కళలపై ఆసక్తి పెంచుకున్నారు.

ఇంటివాళ్లకు చెప్పకుండా ముంబయికి వెళ్లి అక్కడ ఓ ఆర్ట్స్ కాలేజీలో చేరిన శివశక్తి దత్తా, రెండు సంవత్సరాల తర్వాత తిరిగి కొవ్వూరుకు వచ్చి ‘కమలేశ్’ అనే కలం పేరుతో చిత్రకారుడిగా పని చేశారు. చిత్రలేఖనంతో పాటు సంగీతంపై అభిరుచి పెంచుకున్న ఆయన గిటార్‌, సితార్‌, హార్మోనియం వంటి వాద్యాలను నేర్చుకున్నారు.

అనంతరం మద్రాసుకు వెళ్లి తన తమ్ముడు విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి సినీరంగంలో అడుగుపెట్టారు. 1988లో వచ్చిన ‘జానకిరాముడు’ సినిమాకు స్క్రీన్ రైటర్‌గా పనిచేసి మంచి గుర్తింపు పొందారు. సినిమాల పట్ల తనకున్న మక్కువతో పలు చిత్రాల్లో గీతాలు రాశారు. ముఖ్యంగా బాహుబలి సిరీస్, ఆర్‌ఆర్‌ఆర్, హనుమాన్, ఎన్టీఆర్: కథానాయకుడు, సై, ఛత్రపతి, రాజన్న వంటి చిత్రాలకు ఆయన రచించిన పాటలు విశేషంగా నిలిచాయి.

శివశక్తి దత్తాకు ముగ్గురు సంతానం — సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణి, కల్యాణి మాలిక్, రచయిత శివశ్రీ కంచి. ఆయనకు ఒక అన్న, ఒక అక్క, నలుగురు తమ్ముళ్లు ఉన్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, గాయని, సంగీత దర్శకురాలు ఎం.ఎం. శ్రీలేఖకు శివశక్తి దత్తా పెద్దనాన్న. శివశక్తి దత్తా తెలుగు సినీ పరిశ్రమకు ఇచ్చిన సేవలు, సంగీత–సాహిత్య పట్ల ఆయనకున్న అభిమానం సినీ ప్రియుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories