Sobhita: అక్కినేని కొత్త కోడలు క్రేజ్ మామూలుగా లేదుగా..వామ్మో ఆ విషయంలో తోపు

Sobhita: అక్కినేని కొత్త కోడలు క్రేజ్ మామూలుగా లేదుగా..వామ్మో  ఆ విషయంలో తోపు
x
Highlights

Sobhita: సినిమా అభిమానులకు కొంతమంది హీరోలు, హీరోయిన్లు చాలా నచ్చుతారు. సినిమాలు చూడటంలోనే కాదు సోషల్ మీడియాలో వారికి నచ్చిన యాక్టర్స్ ను ఫాలో...

Sobhita: సినిమా అభిమానులకు కొంతమంది హీరోలు, హీరోయిన్లు చాలా నచ్చుతారు. సినిమాలు చూడటంలోనే కాదు సోషల్ మీడియాలో వారికి నచ్చిన యాక్టర్స్ ను ఫాలో అవుతుంటారు. తమకు నచ్చిన యాక్టర్స్ పాపులారిటీని పెంచడంలోనూ అభిమానులే ముందుంటారు. ఇలా ఫాలోయింగ్ సంపాదించుకున్న వారిలో టాప్ జాబితాలో ఎవరున్నారో వారి లిస్టును ఎంటర్ టైన్ మెంట్ డేటాబేస్ ఫ్లాట్ ఫామ్ ఐఎంబీడీ విడుదల చేసింది. మరి ఈ జాబితాలో ఎవరెవరో ఉన్నారో చూద్దామా.

ఐఎంబీడీ మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ 2024 లిస్టులో త్రుప్తి డిమ్రి టాప్ ప్లేస్ లో నిలిచారు. 2023లో వచ్చిన యానిమల్ మూవీలో ఈమె కీరోల్లో నటించారు. ఈ మూవీ విడుదల తర్వాత నేషనల్ క్రష్ గా డిమ్రి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది బాడ్ న్యూజ్ భూల్ భూలయ్యా 3 మూవీస్ తో హంగామా చేసింది.

దీపికా పదుకొణే:

ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు దీపికా పదుకొణే. ఈ ఏడాది దీపికా హీరోయిన్ గా యాక్ట్ చేసిన మూడు సినిమాలు కల్కి 2898, ఫైటర్, సింగం ఎగైన్ విడుదలయ్యాయి. కల్కి 2898 తో దీపికా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

శోభిత ధూళిపాళ:

ఇక మంకీ మ్యాన్ మూవీతో హాలీవుడ్ కు వెళ్లిన అక్కినేని కొత్త కోడలు శోభిత ధూళిపాళకు మంచి స్టార్ డమ్ ఉంది. తెలుగు కంటే బాలీవుడూ లోనే ఆమెకు మంచి క్రేజ్ ఉంది. కల్కి 2898 ఏడీలో దీపికాకు డబ్బింగ్ కూడా చెప్పింది.

శార్వరి వాఘ్:

ముంజ్యా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది శార్వరి వాఘ్. ఈ ఏడాది ఆమె యాక్ట్ చేసిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. ముంజ్యా , మహారాజ్, వేదా, శార్వరి ఈ ఆగస్టులో ఐఎండీబీ బ్రేక్ అవుట్స్టార్ స్టార్ మీటర్ అవార్డు కూడా అందుకుంది.

ఐశ్వర్యరాయ్:

ఇక అందాల తార ఐశ్వర్యరాయ్ ఈ కాలం కుర్రకారును కూడా తన అందచందాలతో కట్టిపడేసింది. ఈ మధ్యకాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా తన భర్త అభిషేక్ తో విడాకులు విషయంలో రూమర్స్ వచ్చాయి. అయినా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఆమె స్థానంలో ఏమాత్రం తేడా లేదు. ఈవిధంగా ఐఎంబీడీ లిస్టులో ఆమె స్థానం దక్కించుకుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories