Biggboss 9 : బిగ్‌బాస్ హౌస్‌లో ఆ ముగ్గురు ఫేక్.. డబుల్ గేమర్స్.. శ్రష్టి వర్మ షాకింగ్ రివీల్

Biggboss 9 : బిగ్‌బాస్ హౌస్‌లో ఆ ముగ్గురు ఫేక్.. డబుల్ గేమర్స్.. శ్రష్టి వర్మ షాకింగ్ రివీల్
x

Biggboss 9 : బిగ్‌బాస్ హౌస్‌లో ఆ ముగ్గురు ఫేక్.. డబుల్ గేమర్స్.. శ్రష్టి వర్మ షాకింగ్ రివీల్

Highlights

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మొదటి వారం ముగిసింది. తొలి వారం ఎలిమినేషన్‌లో కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌస్ నుండి బయటకు వచ్చారు. ఆమె మొదటి రోజు చాలా ఉత్సాహంగా హౌస్‌లోకి అడుగుపెట్టినా, ఆ తర్వాత ఆ ఉత్సాహాన్ని కొనసాగించలేకపోయారు. ఆమె అంతగా చురుగ్గా కనిపించకపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు.

Biggboss 9 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మొదటి వారం ముగిసింది. తొలి వారం ఎలిమినేషన్‌లో కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌస్ నుండి బయటకు వచ్చారు. ఆమె మొదటి రోజు చాలా ఉత్సాహంగా హౌస్‌లోకి అడుగుపెట్టినా, ఆ తర్వాత ఆ ఉత్సాహాన్ని కొనసాగించలేకపోయారు. ఆమె అంతగా చురుగ్గా కనిపించకపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. అందుకే ప్రేక్షకులు ఆమెకు తక్కువ ఓట్లు వేయడం వల్ల మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. అయితే, ఆమె ఎలిమినేట్ అయినందుకు ఏమాత్రం బాధపడలేదు.

ఎలిమినేషన్ సమయంలో శ్రష్టి వర్మ హౌస్‌మేట్స్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. తన దృష్టిలో రాము రాథోడ్, మర్యాద మనీష్, హరిత హరీష్ చాలా నిజాయితీపరులని చెప్పారు. అలాగే ఫ్లోరా సైనీ చాలా స్వీట్ పర్సన్, నిజాయితీగా ఉంటారని పేర్కొన్నారు. మరోవైపు, భరణి, రితు చౌదరి, తనుజలలను ఫేక్, డబుల్ గేమర్స్ అని చెప్పారు. భరణిని అన్నయ్యలా భావించినా, అతనిపై నమ్మకం పోయిందని శ్రష్టి వెల్లడించారు.

ఆదివారం ఎపిసోడ్‌లో మిరాయ్ సినిమా టీమ్ సందడి చేసింది. హీరో తేజ సజ్జా, హీరోయిన్ రితిక నాయక్ హౌస్‌లోకి వచ్చి సభ్యులతో సరదాగా గేమ్స్ ఆడారు. అనంతరం, హౌస్‌లో ఉన్న తొమ్మిది మంది సభ్యులలో ఒకరికి హానోరి అయ్యే అవకాశం ఇచ్చారు. దీనికోసం సభ్యులను రెండు టీములుగా విభజించారు. టాస్క్‌లో భరణి టీమ్ గెలిచింది. సభ్యుల ఓటింగ్ ఆధారంగా భరణి హానోరిగా ఎంపికయ్యారు. అతనికి అసిస్టెంట్‌గా తనుజలను ఎంచుకున్నారు. ఇక సోమవారం నుంచి భరణి హానోరిగా కొనసాగుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories