Salman Khan: నెట్టింటా సల్మాన్ ఖాన్ బలూచిస్థాన్ రచ్చ!

Salman Khan
x

Salman Khan: నెట్టింటా సల్మాన్ ఖాన్ బలూచిస్థాన్ రచ్చ!

Highlights

Salman Khan: సల్మాన్ ఖాన్ మరోసారి కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. సౌదీలో జరిగిన ఓ కార్యక్రమంలో బలూచిస్థాన్‌ను పాకిస్థాన్‌ నుంచి వేరు చేసి మాట్లాడాడు. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. సల్మాన్ వ్యాఖ్యలపై చర్చ హోరెత్తుతోంది. ఈ వివాదం ఏమిటో చూద్దాం.

Salman Khan: సల్మాన్ ఖాన్ కు వివాదాలు కొత్తేమీ కాదు. సౌదీ అరేబియాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇండియన్ సినిమాల ఆదరణ గురించి మాట్లాడాడు. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలు వందల కోట్ల బిజినెస్ చేస్తున్నాయని, బాలీవుడ్ సినిమాలు సౌదీలో హిట్ అవుతాయని చెప్పాడు. అయితే, పాకిస్థాన్, బలూచిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన వారు సౌదీలో స్థిరపడ్డారని అనడం వివాదాస్పదమైంది.

బలూచిస్థాన్‌ను పాకిస్థాన్ నుంచి వేరు చేసి మాట్లాడటం నెట్టింట చర్చనీయాంశమైంది. బలూచిస్థాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సమయంలో సల్మాన్ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.


గతంలోనూ టెర్రరిజం, పాకిస్థాన్‌పై సానుకూల వ్యాఖ్యలతో సల్మాన్ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈసారి ఆయన ఉద్దేశపూర్వకంగానా లేక పొరపాటున అన్నాడా అనేది స్పష్టత లేదు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి చర్చిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories