Soothravakyam: ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న 'సూత్రవాక్యం'.. థ్రిల్లింగ్ స్టోరీకి తెలుగు ప్రేక్షకులు ఫిదా!

Soothravakyam: ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సూత్రవాక్యం.. థ్రిల్లింగ్ స్టోరీకి తెలుగు ప్రేక్షకులు ఫిదా!
x
Highlights

Soothravakyam: మలయాళంలో మంచి ప్రశంసలు పొందిన హృదయానికి హత్తుకునే సినిమా సూత్రవాక్యం ఇప్పుడు తెలుగు ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Soothravakyam: మలయాళంలో మంచి ప్రశంసలు పొందిన హృదయానికి హత్తుకునే సినిమా సూత్రవాక్యం ఇప్పుడు తెలుగు ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా గత నెలలో అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైన మొదటి రోజు నుంచే మంచి స్పందన అందుకుంటోంది. తాజాగా ఈ సినిమా అరుదైన రికార్డును నెలకొల్పింది. ఓటీటీ రిలీజ్ నాటి నుండి ఇప్పటివరకు 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ సాధించి డిజిటల్ ప్రపంచంలో తన సత్తాను చాటింది.

పోలీస్ వ్యవస్థ గురించి సంప్రదాయ ఆలోచనలను ప్రశ్నిస్తూ ఈ సినిమా తెరకెక్కింది. పోలీసులు కేవలం నేరాలను పరిష్కరించే వారు మాత్రమే కాదు, తమ ఖాళీ సమయంలో పిల్లలకు పాఠాలు నేర్పి, సమాజంలో మార్పు తీసుకురావాలనే విప్లవాత్మక ఆలోచనతో ఈ సినిమా రూపొందించబడింది. ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే మరియు థ్రిల్లింగ్ కథాంశంతో ఈ ఆలోచన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ సినిమాతో యూజీన్ జాస్ చిరమ్మెల్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రానికి నిర్మాత అయిన శ్రీకాంత్ కండ్రేగుల కూడా సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన నటన, డైలాగ్ డెలివరీ, మరియు స్క్రీన్ ప్రెసెన్స్ మెప్పిచింది. సూత్రవాక్యం సినిమా ఊహించని మలుపులతో ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ను అందిస్తుంది. పోలీస్ అధికారి దర్యాప్తు ఎపిసోడ్ ఎక్కడా విసుగు అనిపించదు. ఈ సినిమా థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో కూడా ప్రజాదరణ పొందుతు రికార్డ్ వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories