DJ Tillu-2: డీజే టిల్లు సీక్వెల్‌ నుండి శ్రీలీల ఔట్.. ఏమైందంటే?

DJ Tillu-2: యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన క్రైమ్ కామెడీ చిత్రం "డీజే టిల్లు" బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Published on: 25 Sept 2022 10:21 AM IST
Sree Leela out of DJ Tillu 2 due to an Some Issues
X

DJ Tillu-2: డీజే టిల్లు సీక్వెల్‌ నుండి శ్రీలీల ఔట్.. ఏమైందంటే?

DJ Tillu-2: యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన క్రైమ్ కామెడీ చిత్రం "డీజే టిల్లు" బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల కలెక్షన్లు నమోదు చేసి ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలోనే ఏమాత్రం ఆలస్యం లేకుండా దర్శక నిర్మాతలు వెంటనే సినిమాకి సీక్వెల్ ను కూడా ప్రకటించేశారు. ఈ మధ్యనే సినిమా సీక్వెల్ ను లాంచ్ కూడా చేసేసారు. కానీ ఏ ముహూర్తాన సినిమా ఓకే అయ్యిందో కానీ మొదలైనప్పటి నుండి ఏవో ఒక అవాంతరాలు వస్తూనే ఉన్నాయి.

"డీజే టిల్లు" సినిమాకి స్క్రిప్ట్ విషయంలో సిద్ధు జొన్నలగడ్డతో తనకు వచ్చిన క్రియేటివ్ విభేదాల వల్ల సినిమాకి దర్శకత్వం వహించాల్సిన విమల్ కృష్ణ సినిమా నుంచి వెనకడుగు వేశారు. చాలా కాలం వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరిగింది అని ఇప్పుడు విమల్ కృష్ణ సినిమా నుంచి తప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు సినిమాకి మరొక షాక్ తగిలింది. "పెళ్లి సందడి" బ్యూటీ శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా నటించాల్సి ఉంది. చిత్ర బృందం తో వచ్చిన విభేదాల వల్ల ఈమె కూడా సినిమా నుండి తప్పుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు సినిమాకి విమల్ కృష్ణ బదులుగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మల్లిక్ రామ్ తేజ సజ్జ మరియు శివాని హీరో హీరోయిన్లుగా నటించిన "అద్భుతం" సినిమాకి దర్శకత్వం వహించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story