శ్రీదేవి ఇల్లు కబ్జా వివాదం.. కోర్టు తలుపులు తట్టిన బోనీ కపూర్

శ్రీదేవి ఇల్లు కబ్జా వివాదం.. కోర్టు తలుపులు తట్టిన బోనీ కపూర్
x

శ్రీదేవి ఇల్లు కబ్జా వివాదం.. కోర్టు తలుపులు తట్టిన బోనీ కపూర్

Highlights

కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అందాలతార, అతిలోక సుందరి శ్రీదేవి కన్నుమూసి ఏడేళ్లు గడిచినా, ఆమె జ్ఞాపకాలు నేటికీ అందరినీ కదిలిస్తూనే ఉన్నాయి.

కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అందాలతార, అతిలోక సుందరి శ్రీదేవి కన్నుమూసి ఏడేళ్లు గడిచినా, ఆమె జ్ఞాపకాలు నేటికీ అందరినీ కదిలిస్తూనే ఉన్నాయి. బాలీవుడ్, టాలీవుడ్ చిత్రపరిశ్రమల్లో మకుటం లేని మహారాణిగా ఏలిన ఈ అందాలనటి ఆస్తులపై ఇప్పుడు కొత్త వివాదం తెరపైకి వచ్చింది.

చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్‌లో 1988లో శ్రీదేవి కొనుగోలు చేసిన ఆస్తిని ముగ్గురు వ్యక్తులు ఆక్రమించారని ఆరోపిస్తూ, భర్త బోనీ కపూర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ముదలియార్ కుటుంబం నుంచి ఆ స్థలాన్ని శ్రీదేవి కొనుగోలు చేశారని, అన్ని వారసుల సమ్మతితో ఆస్తి తనదిగా మారిందని ఆయన వాదన. కానీ తమే వారసులమంటూ ముగ్గురు వ్యక్తులు నకిలీ లీగల్ హెయిర్ సర్టిఫికెట్‌తో హక్కు సాధించాలని ప్రయత్నిస్తున్నారని బోనీ ఆరోపించారు.

ఈ వివాదంపై 2025 ఏప్రిల్ 22న హైకోర్టులో కేసు వేసిన బోనీ కపూర్, 2005లో తాంబరం తహసీల్దార్ కార్యాలయం నుంచి తీసుకున్న ఆ నకిలీ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరారు. ఈ ఫిర్యాదుపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.

శ్రీదేవి జీవితకాలంలో సొంతం చేసుకున్న ఆస్తులు, ఆమె మరణం తర్వాత భర్త, పిల్లల పేర్లకు బదలాయించబడ్డాయి. అయితే రెండో భార్య పిల్లలమంటూ కొందరు ఇప్పుడు వారసత్వ హక్కులు కోరుకోవడం వివాదానికి దారి తీసింది. న్యాయస్థానం తుది నిర్ణయంతో ఆ చెన్నై ఆస్తి భవిష్యత్తు ఏవిధంగా మలుపు తిరుగుతుందో త్వరలోనే తేలనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories