Sridevi : శ్రీదేవి ఆస్తిపై వివాదం.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన బోనీ కపూర్

Sridevis Property Dispute, Boney Kapoor Files Case in Court
x

Sridevi : శ్రీదేవి ఆస్తిపై వివాదం.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన బోనీ కపూర్

Highlights

Sridevi : శ్రీదేవి ఆస్తిపై వివాదం.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన బోనీ కపూర్

Sridevi : అతిలోక సుందరి, నటి శ్రీదేవి మరణించి దాదాపు ఏడేళ్లు అవుతుంది. బాత్ టబ్ లో మునిగి ఆమె మరణించడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొదట్లో ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్ మీద కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ దుబాయ్ పోలీసులు విచారణ జరిపి శ్రీదేవి మరణం ఒక ప్రమాదం అని తేల్చారు. ఇప్పుడు శ్రీదేవి పేరు మరోసారి ఓ వివాదం కారణంగా వార్తల్లోకి వచ్చింది.

శ్రీదేవి దశాబ్దాల పాటు తెలుగు, తమిళం, హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. 80వ దశకంలో ఆమె అత్యంత డిమాండ్ ఉన్న, ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటి. అయితే, ఆ సమయంలో ఆమె కొన్న ఒక ఆస్తి ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఈ ఆస్తి వివాదానికి సంబంధించి శ్రీదేవి భర్త బోనీ కపూర్ మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు.

వివాదానికి కారణం ఏంటి?

1988లో నటి శ్రీదేవి చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్‌లో ఒక ఆస్తిని కొన్నారు. దానిని శ్రీదేవి, ఆమె కుటుంబం ఫామ్‌హౌస్‌గా ఉపయోగించేవారు. అయితే, 2005 నుండి ఈ ఆస్తిపై కోర్టులో వివాదం నడుస్తోంది. ఇప్పుడు ఆ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారని ఆరోపిస్తూ బోనీ కపూర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

కోర్టు ఆదేశాలు

బోనీ కపూర్ ప్రకారం, ఈ స్థలం మొదట ముదలియార్ అనే వ్యక్తికి చెందినది. 1960లో ఆయన పిల్లలు ఈ స్థలాన్ని పంచుకున్నారు. ఆ తర్వాత ముదలియార్ కుమారుడి నుండి శ్రీదేవి ఆ స్థలాన్ని కొనుగోలు చేశారు. కానీ 2005లో, ముదలియార్ రెండో భార్య ఇద్దరు పిల్లలు, మొదటి భార్య ఒక కూతురు కలిసి ఈ స్థలం తమదని కోర్టులో దావా వేశారు. ఇప్పుడు ఈ దావా వేసినవారిలో కొందరు ఆ ఆస్తిని ఆక్రమించారని బోనీ కపూర్ ఆరోపించారు.

బోనీ కపూర్ పిటిషన్‌ను విచారించిన కోర్టు, తాంబరం తాలూకా తహసీల్దార్‌కు కొన్ని సూచనలు ఇచ్చింది. ఈ స్థలం గురించిన డాక్యుమెంట్లను పరిశీలించి, బోనీ కపూర్ ఆరోపించినట్లుగా నకిలీ వారసత్వ ధ్రువీకరణ పత్రం నిజమో కాదో నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories