Rajamouli: రాజ‌మౌళికి మ‌రో అరుదైన గౌర‌వం.. జ‌ప‌నీస్ వీడియో గేమ్‌లో

Rajamouli: రాజ‌మౌళికి మ‌రో అరుదైన గౌర‌వం.. జ‌ప‌నీస్ వీడియో గేమ్‌లో
x

Rajamouli: రాజ‌మౌళికి మ‌రో అరుదైన గౌర‌వం.. జ‌ప‌నీస్ వీడియో గేమ్‌లో

Highlights

ప్ర‌పంచ సినిమా చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. బాహుబ‌లి, ట్రిపులార్ సినిమాల‌తో తెలుగు సినిమా స్థాయిని మాత్ర‌మే కాకుండా ఇండియ‌న్ సినిమా స్థాయిని ప్ర‌పంచానికి చాటి చెప్పాడు. అప‌జ‌యం అంటూ ఎర‌గ‌ని రాజ‌మౌళికి తాజాగా మ‌రో అరుదైన గుర్తింపు లభించింది.

ఇప్పటివరకు ఇండియన్ సెలబ్రెటీగా ఎవరూ చేయలేని పనిని రాజమౌళి చేసి చూపించారు. జపాన్‌కు చెందిన ప్రముఖ గేమ్ డెవలపర్ హిడియో కోజిమా రూపొందిస్తున్న డెత్ స్టాండింగ్ 2 (Death Stranding 2) వీడియో గేమ్‌లో రాజమౌళి కనిపించడంతో ఆయన నేడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారిపోయారు.

డెత్ స్టాండింగ్ 2లో జక్కన్న, కార్తికేయ

ఈ వీడియో గేమ్‌లో రాజమౌళి మాత్రమే కాకుండా ఆయన కుమారుడు కార్తికేయ కూడా కనిపించడం విశేషం. ఇలా ఒకే గేమ్‌లో ఇద్దరూ ఉండటం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. గేమ్ ట్రైలర్‌లో వీరి రూపాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా వీడియో గేమింగ్ ప్రపంచం అంతా ఈ కాంబినేషన్‌పై ఆసక్తిగా మారింది. ఇదే భారతదేశం నుంచి ఆ వీడియో గేమ్‌లో కనిపించిన తొలి సెలబ్రెటీగా రాజమౌళికి గుర్తింపు తెచ్చింది.

ఇదిలా ఉంటే.. జపాన్‌తో రాజమౌళి సంబంధం కొత్తది కాదు. ఆర్ఆర్ఆర్ సినిమాను అక్కడ విశేషంగా ప్రమోట్ చేసి భారీ విజయాన్ని అందుకున్నారు. అప్పట్లో కోజిమాతో ఆయన భేటీ అవ్వడం వైరల్ అయింది. అప్పుడే కొందరు, “రాజమౌళి – కోజిమా కలిసి ఏదైనా ప్రాజెక్ట్ చేయబోతున్నారా?” అనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు వీరి కలయిక ఓ గేమ్ రూపంలో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇదిలా ఉంటే రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న భారీ సినిమా పనుల్లో నిమగ్నమయ్యారు. ఇది పాన్ వరల్డ్ లెవల్‌లో తెరకెక్కుతోంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. మహేష్ బాబు ఒక కొత్త లుక్‌లో కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. మేకర్స్ త్వరలో మరిన్ని అప్‌డేట్స్ ఇవ్వనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories