Varanasi: వారణాసి.. షాకిస్తున్న పారితోషికాలు..?

Varanasi: వారణాసి.. షాకిస్తున్న పారితోషికాలు..?
x
Highlights

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎస్ఎస్ రాజమౌళి చేస్తున్న భారీ ప్రాజెక్ట్ వారణాసి.

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎస్ఎస్ రాజమౌళి చేస్తున్న భారీ ప్రాజెక్ట్ వారణాసి. ఈ చిత్రం రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌లో రూపొందనుంది తెలుస్తోంది. హీరోయిన్ ప్రియాంక చోప్రాకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ అయినట్లు సమాచారం. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

ఎస్ఎస్ రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న అడ్వెంచర్ థ్రిల్లర్ వారణాసి ప్రపంచ స్థాయి చిత్రంగా తెరకెక్కనుంది. ఈ సినిమా బడ్జెట్ రూ.1300 కోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం. మహేష్ బాబు, రాజమౌళి లాభాల్లో షేర్ తీసుకోనున్నారు.

హీరోయిన్‌గా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనస్ నటిస్తుండగా, ఆమెకు రూ.40 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఆఫర్ అయినట్లు తెలుస్తోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటిస్తుండగా, ఆయనకు రూ.10 కోట్ల పైచిలుకు పారితోషికం ఖరారైందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories