SSMB29: SSMB29 ఫస్ట్‌ అప్‌డేట్‌.. కుమ్మేస్తున్న ‘కుంభ’!

SSMB29: SSMB29 ఫస్ట్‌ అప్‌డేట్‌.. కుమ్మేస్తున్న ‘కుంభ’!
x

SSMB29: SSMB29 ఫస్ట్‌ అప్‌డేట్‌.. కుమ్మేస్తున్న ‘కుంభ’!

Highlights

SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఎస్‌ఎస్‌ఎంబీ29 చిత్రం గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తోంది.

SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఎస్‌ఎస్‌ఎంబీ29 చిత్రం గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్‌ను ‘కుంభ’గా రివీల్ చేశారు. వీల్‌చైర్‌లో అంగవైకల్యంతో కనిపిస్తూ రోబోటిక్ చేతులతో పవర్‌ఫుల్ విలన్‌గా పృథ్వీరాజ్ ఆకట్టుకున్నాడు.

ఇండియన్ సినిమాలో నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్టుగా ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఎస్‌ఎస్‌ఎంబీ29 చిత్రం రాబోతుంది. భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 15న జరగనున్న భారీ ఈవెంట్ ముందు రాజమౌళి సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు.

తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ‘కుంభ’ పాత్రలో పృథ్వీరాజ్‌ను పరిచయం చేస్తూ షాకింగ్ లుక్ రివీల్ చేశారు. వీల్‌చైర్‌లో కూర్చుని అంగవైకల్యం కనిపిస్తూనే, చైర్ వెనుక రోబోటిక్ చేతులతో శక్తివంతమైన విలన్‌గా కనువిందు చేశాడు. ఈ యూనిక్ రోల్ ఊహించని ట్విస్ట్‌ను సూచిస్తోంది. రాజమౌళి బిగ్ స్టార్స్‌తో ప్లాన్ చేస్తున్న ట్రీట్‌లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తదుపరి అప్‌డేట్ ఎలా ఉంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంమీద ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories