
Rajamouli Movie: జక్కన్నకే సవాల్ విసిరిన ఆ సీన్.. మహేష్ ఫ్యాన్స్‌కు పూనకాలే!
Rajamouli Movie: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
Rajamouli Movie: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, తాజాగా బయటకు వచ్చిన అప్డేట్స్ చూస్తుంటే, రాజమౌళి ఈసారి విజువల్ వండర్‌తో పాటు ఒక ఎమోషనల్ యాక్షన్ అడ్వెంచర్‌ను సిద్ధం చేస్తున్నట్లు అర్థమవుతోంది.
సాధారణంగా రాజమౌళి సినిమా అంటే ఏళ్లు పడుతుంది. కానీ 'వారణాసి' విషయంలో జక్కన్న రూట్ మార్చారు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయిందని సమాచారం. మర్యాద రామన్న తర్వాత రాజమౌళి ఇంత వేగంగా షూట్ చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. జూన్ 2026 నాటికి గుమ్మడికాయ కొట్టేసి, జూలై నుంచి విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో నిమగ్నం కావాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.
రాజమౌళి విజువల్ ఎఫెక్ట్స్‌తో మాయ చేయగలరని మనకు తెలుసు. కానీ ఈ సినిమాలో రామాయణ సీక్వెన్స్ అనే ఒక ప్రత్యేక ఘట్టం ఉందట. తన కెరీర్లోనే ఇది అత్యంత కష్టతరమైన సీన్ అని స్వయంగా రాజమౌళి తెలపడం విశేషం. ఈ సీన్ కోసం వాడిన గ్రాఫిక్స్ , విజువల్స్ ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడని విధంగా ఉంటాయని టాక్. షూట్ చేసిన సీన్‌కు VFX జోడించడానికి నిపుణులు సైతం ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారంటే, ఆ సీన్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్న ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మహేష్ బాబు మేకోవర్, రాజమౌళి మేకింగ్ స్టైల్ చూస్తుంటే.. ఈ 'వారణాసి' ప్రయాణం కేవలం బాక్సాఫీస్ రికార్డులనే కాదు, ప్రపంచ సినిమా స్థాయిని కూడా మార్చేలా కనిపిస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




