Sudheer Babu: 'జటాధర' ప్రీ-రిలీజ్‌లో ఎమోషనల్ అయిన హీరో సుధీర్ బాబు

Sudheer Babu: జటాధర ప్రీ-రిలీజ్‌లో ఎమోషనల్ అయిన హీరో..
x

Sudheer Babu: 'జటాధర' ప్రీ-రిలీజ్‌లో ఎమోషనల్ అయిన హీరో..

Highlights

Sudheer Babu: ప్రతీ సినిమాకు వైవిధ్యం చూపిస్తూ 'నవ దళపతి'గా పేరు తెచ్చుకుంటున్న హీరో సుధీర్ బాబు, ఇప్పుడు హర్రర్ థ్రిల్లర్ జోనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Sudheer Babu: ప్రతీ సినిమాకు వైవిధ్యం చూపిస్తూ 'నవ దళపతి'గా పేరు తెచ్చుకుంటున్న హీరో సుధీర్ బాబు, ఇప్పుడు హర్రర్ థ్రిల్లర్ జోనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'హరోం హర', క్లాస్ ఫ్యామిలీ సెంటిమెంట్ చిత్రం 'మా నాన్న సూపర్ హీరో' తర్వాత, ఆయన నటించిన తాజా చిత్రం 'జటాధర' ఈ నెల నవంబర్ 7న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ముఖ్య పాత్ర పోషించడం విశేషం.

తాజాగా నిర్వహించిన 'జటాధర' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సుధీర్ బాబు చేసిన ఎమోషనల్ కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. సినిమా రంగంలోకి రావాలా వద్దా అని తాను చాలాసార్లు ఆలోచించానని, కానీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తనపై వచ్చిన ప్రతి విమర్శను స్వీకరించి, తనను తాను మెరుగుపరుచుకోవడానికి నిరంతరం కష్టపడుతున్నానని తెలిపారు.

అదే సమయంలో, "సుధీర్ బాబు అంటే ఎవరు?" అని వేలసార్లు తనను తాను ప్రశ్నించుకున్నానని, దానికి ఒక్కటే సమాధానమని అన్నారు. "సుధీర్ బాబు అంటే కృష్ణ గారి అల్లుడు, మహేష్ బాబు గారి బావ. ఇదే అందరికీ తెలుసు. ఈ నిజాన్ని నేను గర్వంగా ఒప్పుకుంటున్నాను. పబ్లిక్‌గా ఇలాంటి నిజాలు ఒప్పుకోవడానికి నిజంగా ధైర్యం కావాలి" అంటూ తన మనసులోని మాటను నిర్భయంగా బయటపెట్టారు.

'జటాధర' సినిమాపై ఆయన పూర్తి ధీమా వ్యక్తం చేశారు. "మేము ఒక మంచి సినిమా తీశాం. ఇది కేవలం హర్రర్ థ్రిల్లరే కాదు. ఓ కొత్త కథ, కుటుంబంతో కలిసి చూసేందుకు కావాల్సిన ఎమోషన్స్, భక్తి వంటి అనేక మంచి లేయర్స్ ఈ సినిమాలో ఉన్నాయి" అని సుధీర్ బాబు చెప్పారు.

'కార్తికేయ 2' సినిమాలో కృష్ణుడి ఎపిసోడ్ ఎంతటి హైలైట్‌గా నిలిచిందో, 'జటాధర'లో కూడా కొన్ని ఎపిసోడ్స్ అదే స్థాయిలో హైలైట్ అవుతాయని తాను బలంగా నమ్ముతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా అరుణాచలం వెళ్లే భక్తులకు, వెళ్లాలనుకునే వారికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అంతేకాక, తాను నటించిన 'ప్రేమ కథా చిత్రం' సినిమా చూసే, ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీ చేయడానికి ఒప్పుకున్నారని ఆ మాట ప్రభాస్ స్వయంగా చెప్పినప్పుడు చాలా సంతోషం కలిగిందని సుధీర్ బాబు గుర్తు చేసుకున్నారు.

'జటాధర' చిత్రంలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ప్రేతాత్మ పాత్రలో కనిపించనున్నారు. ఆమె గెటప్, లుక్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. దర్శకుడు వెంకట్ కళ్యాణ్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ భాషల్లోనూ నవంబర్ 7, 2025న విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories