Akkineni Nagarjuna: 27 ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్‌తో నాగ్ రొమాన్స్

Akkineni Nagarjuna: 27 ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్‌తో నాగ్ రొమాన్స్
x
Highlights

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున, టబు అనగానే మనకు గుర్తొచ్చేది 'నిన్నే పెళ్లాడుతా'. ఆ సినిమా సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత 'ఆవిడ మా ఆవిడే'లోనూ ఈ జోడీ అలరించింది.

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున, టబు అనగానే మనకు గుర్తొచ్చేది 'నిన్నే పెళ్లాడుతా'. ఆ సినిమా సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత 'ఆవిడ మా ఆవిడే'లోనూ ఈ జోడీ అలరించింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత, దాదాపు 27 ఏళ్ల విరామం అనంతరం తన 100వ సినిమా కోసం ఈ క్లాసిక్ జోడీ జతకట్టబోతోంది.

ఈ విషయంపై నాగార్జున స్పందిస్తూ.. టబు నాకు ఆమె కెరీర్ ప్రారంభం నుంచే తెలుసు. నా 100వ సినిమా గురించి తెలియగానే, తను కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాలని ఎంతో ఆశపడింది అని క్లారిటీ ఇచ్చారు. ఇందులో టబు ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతుండటం విశేషం.

తమిళ దర్శకుడు రా కార్తీక్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ‘లాటరీ కింగ్’ అనే వెరైటీ టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. 'కింగ్' నాగార్జున 100వ సినిమా కావడంతో టైటిల్ విషయంలోనే సెన్సేషన్ మొదలైంది.

ప్రస్తుత సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ , భారీ గ్రాఫిక్స్ రాజ్యమేలుతున్నాయి. కానీ నాగార్జున మాత్రం ఈ విషయంలో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. కేవలం కంప్యూటర్ గ్రాఫిక్స్‌పై ఆధారపడకుండా, ఒళ్లు గగుర్పొడిచే 'రియలిస్టిక్ యాక్షన్' సీక్వెన్స్‌లపై ఫోకస్ చేస్తున్నారు.

ప్రేక్షకులు ఇప్పుడు అతిశయోక్తులతో కూడిన యాక్షన్‌ను ఇష్టపడటం లేదు. వాస్తవానికి దగ్గరగా ఉంటేనే కనెక్ట్ అవుతున్నారు అని నాగ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. హీరో ఇమేజ్ కంటే కథాబలాన్నే నమ్ముకుని సహజంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

వందవ సినిమా అంటే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. అందుకే రిలీజ్ డేట్ కోసం నాగ్ ఎక్కడా తొందరపడటం లేదు. సినిమా అవుట్‌పుట్ వంద శాతం పర్ఫెక్ట్‌గా వచ్చే వరకు ఎంత సమయమైనా తీసుకోవాలని టీమ్‌కు సూచించారట. క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడకూడదని ఆయన గట్టిగా డిసైడ్ అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories