TBD Digital OTT Platform: నెలకు కేవలం ₹10కే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌!

TBD Digital OTT Platform
x

TBD Digital OTT Platform

Highlights

TBD Digital OTT Platform: దుబాయ్ కేంద్రంగా రాయల్ ర్యాప్చీ వారి ‘టి.బి.డి’ (త్రిభాణధారి) ఓటీటీ ఇండియాలో అరంగేట్రం

TBD Digital OTT Platform: భారతీయ ఓటీటీ (OTT) రంగంలో సంచలనం సృష్టించడానికి దుబాయ్ కేంద్రంగా నడుస్తున్న 'రాయల్ ర్యాప్చీ' సంస్థ 'టీబీడీ' (త్రిభాణధారి) డిజిటల్ ఓటీటీ ద్వారా అడుగుపెట్టింది. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా, కేవలం రూ. 10/- నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రుసుముతో ఈ ఓటీటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

భారతదేశంలో రూట్‌ లెవల్‌కు విస్తరించడానికి ప్లాన్ చేసుకున్న ఈ సంస్థ, హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్‌క్లబ్‌లో తమ లోగో లాంచ్ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ గారి చేతుల మీదుగా ఈ 'టీబీడీ' యాప్ లాంచ్‌ జరిగింది.

ముఖ్య అతిథులు, సంస్థ పెద్దల ప్రసంగాలు

ఈ కార్యక్రమానికి సంస్థ ఫౌండర్, ఎండీ ధరమ్ గుప్తా, సీఈఓ సునీల్ భోజ్వానీ, సౌత్ ఇండియా సీఈఓలు ప్రముఖ నటులు, నిర్మాత డి.ఎస్. రావు, ప్రముఖ దర్శకుడు వి. సముద్రతో పాటు దర్శకులు వి.ఎన్. ఆదిత్య, చంద్రమహేష్, ఇ. సత్తిబాబు, శివనాగు, డిజిక్వెస్ట్ అధినేత బసిరెడ్డి, 'సంతోషం' అధినేత సురేష్ కొండేటి, నటుడు దాసన్న వంటి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

టిబిడి ఫౌండర్, ఎండీ ధరమ్ గుప్తా: భారతీయ మూలాలకు విస్తరించాలనేది తమ ఆకాంక్ష అని ధరమ్ గుప్తా తెలిపారు. "మా ఓటీటీలో దేశీ కంటెంట్ మాత్రమే ఉంటుంది. ఇందులో కుటుంబం అంతా కూర్చుని చూసే వల్గారిటీ లేని కంటెంట్‌కే ప్రాధాన్యం ఇస్తాం. సెక్స్‌ కంటెంట్ తప్ప అన్ని రకాల సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఉంటాయి. ప్రపంచ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ చరిత్రలో మా రూ. 10 సబ్‌స్క్రిప్షన్ అనేది 'నెవర్‌ బిఫోర్‌' అని చెప్పాలి," అని ఆయన ప్రకటించారు. తెలుగు పరిశ్రమ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎదిగిందని కొనియాడిన ఆయన, సౌత్ సీఈఓలుగా డి.ఎస్.రావు, వి. సముద్ర వంటి టాలెంటెడ్ పర్సన్స్ ఉండటం తమకు గర్వకారణమని చెప్పారు. చిన్న నిర్మాతలకు తమ ఓటీటీలో పెద్ద పీఠ వేస్తామని, పేమెంట్ విషయంలో ఖచ్చితంగా ఉంటామని స్పష్టం చేశారు.

టిబిడి సౌత్ సీఈఓ డి.ఎస్. రావు: "ఓటీటీ బిజినెస్ విషయంలో చిన్న నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి సరైన అప్రోచ్ దొరకడం లేదు. ఇలాంటి టైమ్‌లో టిబిడి రావడం, దీనికి నేను, సముద్ర గారు బాధ్యులుగా ఉండటం హానర్‌గా ఫీలవుతున్నాను. ఈ ఓటీటీ అందరికీ అనుకూలంగా ఉండాలని గుప్తా గారికి చెప్పాం. చిన్న సినిమాలకు ఇది చక్కని వేదిక. తప్పకుండా దీన్ని టాప్‌రేంజ్‌లో నిలబెట్టడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాం," అని డి.ఎస్. రావు హామీ ఇచ్చారు.

టిబిడి సౌత్ సీఈఓ వి. సముద్ర: సౌత్ ఇండియాలో ఈ యాప్ లాంచ్‌కు తెలుగు పరిశ్రమను తొలిగా ఎంచుకున్నందుకు గుప్తా గారికి ధన్యవాదాలు తెలిపారు దర్శకుడు సముద్ర. "ఓటీటీ బిజినెస్ ఇబ్బందులకు మా టిబిడి చక్కని పరిష్కారం. మంచి కంటెంట్ తయారు చేయండి, మేం మీకు సహాయపడతాం. అన్ని లాంగ్వేజ్‌లలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు తీసుకుంటాం. అంతేకాకుండా, ప్రాజెక్ట్‌లకు సంయుక్తంగా నిర్మించడంతో పాటు ఫైనాన్స్ కూడా చేస్తాం. త్వరలోనే ఆడియో రంగంలోకి అడుగుపెడతాం," అని ఆయన వెల్లడించారు.

ముఖ్య అతిథి కె.కె. రాధామోహన్: ఈ ఓటీటీ చిన్న, పెద్ద నిర్మాతలకు అండగా నిలబడాలని, అతి తక్కువ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తున్న టిబిడి టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇతర సినీ ప్రముఖుల అభిప్రాయాలు:

చంద్ర మహేష్: మంచి టేస్ట్ ఉన్న సముద్ర గారు సౌత్ సీఈఓగా ఉండటం వల్ల మంచి సినిమాలు, కంటెంట్ ఇందులో వస్తుందని ఆశిస్తున్నాను.

ఇ. సత్తిబాబు: ఈ టిబిడి వచ్చే సంవత్సరానికి నెంబర్ వన్‌గా నిలబడాలని కోరుకుంటున్నాను.

సురేష్ కొండేటి: టిబిడి లాంటి ప్లాట్‌ఫామ్స్ ఇప్పుడు తెలుగు సినిమాకు చాలా అవసరం. నేటి చిన్న నిర్మాతలే రేపటి పెద్ద నిర్మాతలు అవుతారు. గుప్తా గారు అందరి సినిమాలను కొని ఎంకరేజ్ చేయాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories