
Thalapathy Vijay Divorce Case: విజయ్ భార్య సంగీత సంచలన పిటిషన్.. నీలాంకరై ఇంట్లోనే ఉంటా!
తమిళ స్టార్ విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్. చెన్నై నీలాంకరై నివాసంలోనే ఉండేందుకు అనుమతించాలని కోరుతూ భార్య సంగీత కోర్టులో సంచలన పిటిషన్ దాఖలు చేశారు.
Thalapathy Vijay Divorce Case: తమిళ సూపర్ స్టార్ విజయ్ మరియు ఆయన భార్య సంగీత మధ్య నడుస్తున్న విడాకుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. విడాకుల విచారణ సాగుతున్న సమయంలో, చెన్నై నీలాంకరైలోని తమ ఉమ్మడి నివాసంలోనే ఉండేందుకు అనుమతించాలని కోరుతూ సంగీత కోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఆమె దాఖలు చేసిన తాజా పిటిషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. బ్రిటిష్ పౌరురాలైన సంగీత, తనకు చెన్నైలో ఉండటానికి వేరే నివాసం లేదని కోర్టుకు తెలిపారు. భార్యగా తనకు లభించే హక్కుల ప్రకారం, నీలాంకరై ప్రాపర్టీలో తనకు వాటా ఉందని, అక్కడే నివసించేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. తనతో పాటు తన ఇద్దరు పిల్లలు (జాసన్ సంజయ్, దివ్య సాష) భవిష్యత్తు కోసం ఆర్థిక సాయం కూడా అందించాలని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఫిబ్రవరి 27, 2026న 'స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954' కింద సంగీత విడాకుల కోసం అప్లై చేశారు. ఈ పిటిషన్లో ఆమె విజయ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. 2021లో ఒక ప్రముఖ నటితో విజయ్ నడుపుతున్న సంబంధం గురించి తనకు తెలిసిందని ఆమె దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే విజయ్ తనను మానసిక వేధింపులకు గురిచేశారని కూడా ఆరోపించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా ఏప్రిల్ 20, 2026న విజయ్ స్వయంగా కోర్టుకు హాజరు కావాలని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. అయితే, ఈ వ్యవహారాన్ని కోర్టు బయట సెటిల్మెంట్ చేసుకునేందుకు చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. సుమారు రూ.250 కోట్ల భారీ భరణం ప్యాకేజీతో ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని విజయ్ భావిస్తున్నట్లు అనధికారిక వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇరు పక్షాల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. విజయ్ ప్రస్తుతం కేవలం సినిమా స్టార్ మాత్రమే కాదు, ప్రస్తుతం ఆయన ఒక రాజకీయ పార్టీ (TVK) అధినాయకుడు కూడా. దీంతో ఈ వ్యక్తిగత వివాదం, ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని అభిమానులు, రాజకీయ విశ్లేషకులు ఉత్కంఠగా గమనిస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




